iDreamPost

Lily Movie Review: పాన్ ఇండియా మూవీ ‘లిల్లీ’ రివ్యూ

Lily Movie Review: పాన్ ఇండియా మూవీ ‘లిల్లీ’ రివ్యూ

పాన్ ఇండియా.. ఇప్పుడు ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్లు, హీరోలు అందరూ వారి సినిమాలను దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్లు ఇలా పాన్ ఇండియా లెవల్లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. కానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక చిన్న పిల్లల సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయింది. అది కూడా ఒక డెబ్యూ డైరక్టర్ మూవీ కావడం ఇంకా విశేషం. ఆ మూవీనే.. గోపురం స్టూడియోస్ పాతకంపై కే బాబు రెడ్డి, జీ సతీశ్ కుమార్ నిర్మించిన లిల్లీ చిత్రం. మరి అంత స్పెషల్ గా రిలీజ్ అయిన లిల్లీ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

కథ:

లిల్లీ(బేబీ నేహా), దివ్య(ప్రణతి రెడ్డి), గూగుల్(వేదాంత్ శర్మ) ముగ్గురూ కాస్ల్ మేట్స్ మాత్రమే కాదు.. మంచి ఫ్రెండ్స్ కూడా. వీళ్లంతా కలిసి స్కూలుకు వెళ్లడం, బాగా అల్లరి చేయడం, కలిసి ఆడుకోవడం చేస్తుంటారు. ఓరోజు వీళ్లంతా ఆడుకుంటూ ఉంటే ముక్కు నుంచి రక్తం కారి.. దివ్య కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దివ్యకు ఏమైందో తెలియక అందరూ కంగారు పడతారు. దివ్యను పెంచుతున్న మామ(రాజ్ వీర్)కి ఈ విషయం చెప్తారు. ఆస్పత్రిలో ఉన్న దివ్య గురించి వైద్యులు ఒక భయంకరమైన నిజాన్ని చెప్తారు. దివ్యకు ఏమైంది? ఆమెను కాపాడుకోగలిగారా? లిల్లీ, గూగుల్ కలిసి దివ్య కోసం ఏం చేశారు? రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న దేవా.. దివ్యను రక్షించుకోగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మీరు థియేటర్లలో లిల్లీ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా పూర్తిగా పిల్లల నేపథ్యంలోనే సాగుతుంది. చిన్న పిల్లల మధ్య ఉండే స్నేహం, అనుబంధం ఎలా ఉంటాయి అనే విషయాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అచ్చంగా పిల్లలు నటించిన ఇలాంటి ఒక సినిమా వచ్చి చాలా ఏళ్లు అయిందనే చెప్పాలి. ఇలాంటి కాన్సెప్ట్ తో ముందుకు వచ్చినందుకు కచ్చితంగా గోపురం స్టూడియోస్ బ్యానర్ ను అభినందించాలి.  ఈ మూవీని కడప రూరల్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ మూవీలో ఉన్న డెప్త్ చూస్తే శివమ్ ఎంతో గొప్ప డైరెక్టర్ అవుతాడని ఇట్టే చెప్పేయచ్చు. ఎంతో ఎమోషనల్ టాపిక్ ని తన తొలి చిత్రంలోనే హ్యాండిల్ చేయడం గొప్ప విషయం.

ఎవరెలా చేశారు?:

ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేసిన పిల్లలు అందరూ కొత్త వాళ్లే అయినా.. ఎంతో చక్కగా నటించారు. బాధ, ఆనందం, కోపం ఇలా అన్ని ఎమోషన్స్ ని చాలా బాగా పలికించారు. ఎక్కడా కూడా కొత్త వాళ్లు అనే భావన కలగదు. ముఖ్యంగా లిల్లీ, దివ్య క్యారెక్టర్స్ ప్లే చేసిన బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి ప్రతి సీన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మిగిలిన పాత్రలు పోషించిన చిన్నారులు, నటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఈ సినిమాకి సంబంధించి మొదటిగా డైరెక్టర్ గురించే చెప్పుకోవాలి. ఎంతో సెన్సిటివ్ కాన్సెప్ట్ ని అందరికీ నచ్చేలా.. అందరూ మెచ్చేలా తెరకెక్కించడంలో శివమ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి నటన, భావోద్వేగాలు తీసుకురావడం పెద్ద టాస్క్ ఏం కాదు. కానీ, చిన్న పిల్లలు.. పైగా అంతా కొత్త వాళ్లు అయినా కూడా శివమ్ చాలా బాగా టాకిల్ చేశాడు. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సాంగ్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాగ్దేవీ పాడిన రెండు పాటలు అందరినీ మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. నిర్మాతలు కె సుబ్బారెడ్డి, జీ సతీష్ కుమార్ పాన్ ఇండియా లెవల్ నిర్మాణ విలువలను పాటించారు. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.

ప్లస్ లు:

  • చిన్నారుల నటన
  • శివమ్ టేకింగ్
  • ఎమోషన్స్
  • వాగ్దేవి పాటలు

మైనస్ లు:

  • ఫస్టాఫ్ లో కాస్త నెమ్మదిగా సాగడం

చివరిగా: చిన్న పిల్లలను మాత్రమే కాదు.. పెద్ద వాళ్లను కూడా ‘లిల్లీ’ కంటతడి పెట్టించేస్తుంది.

రేటింగ్:3/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి