iDreamPost

My Dear Donga Movie Review: మై డియర్ దొంగ మూవీ రివ్యూ.. అభినవ్ గోమఠం నటించిన చిత్రం ఎలా ఉందంటే?

ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మై డియర్ దొంగ. తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఎలా ఉంది? అభినవ్ తన మార్క్ కామెడీతో నవ్వించి మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.

ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మై డియర్ దొంగ. తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఎలా ఉంది? అభినవ్ తన మార్క్ కామెడీతో నవ్వించి మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.

My Dear Donga Movie Review: మై డియర్ దొంగ మూవీ రివ్యూ.. అభినవ్ గోమఠం నటించిన చిత్రం ఎలా ఉందంటే?

మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా మూవీ మేకర్స్ కూడా తమ పంథా మార్చుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక కొంత మంది అయితే కేవలం ఓటీటీ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని చిత్రాలను నిర్మిస్తున్నారు. అలా ఓటీటీ ప్రేక్షకులకు టార్గెట్ చేసుకుని తాజాగా రిలీజ్ అయిన చిత్రం ‘మై డియర్ దొంగ’. అభినవ్ గోమఠం, శాలిని కొండేపూడి ప్రధాణ పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అయిన ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ మూవీ ఎలా ఉంది? కథేంటి? అభినవ్ గోమఠం తన నటనతో మెప్పించాడా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

సుజాత(షాలిని) ఓ డేటింగ్ యాప్ కు కాపీ రైటర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె డాక్టర్ విశాల్(నిఖిల్ గాజుల)తో ప్రేమలో పడుతుంది. ఇద్దరు కొంతకాలం ప్రేమించుకున్నాక.. విశాల్ లో మారిపోయాడని, ఎక్కడికి పిలిచినా బిజీ బిజీ అని రావట్లేదని సుజాత బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదే టైమ్ లో సురేశ్(అభినవ్ గోమఠం) సుజాత ఫ్లాట్ లో దొంగతనానికి వస్తాడు. అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అయితే సుజాత బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు ఆమె ఫ్రెండ్స్ బుజ్జి(దివ్య శ్రీపాద), వరుణ్(శశాంక్ మండూరి), విశాల్ వస్తారు. సురేశ్ ను తన చిన్ననాటి స్నేహితుడిగా వారికి పరిచయం చేస్తుంది. సురేశ్, సుజాత ఫ్లాట్ లో ఏ వస్తువు దొంగతనం చేశాడు? దోంగతో ఆమె ఫ్రెండ్షిఫ్ ఎందుకు చేసింది? వీరి గతం ఏంటి? ఈ క్రమంలోనే విశాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:

‘మై డియర్ దొంగ’ మూవీ ఒక విధంగా చెప్పాలంటే ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే. ఓ హీరోయిన్.. ఇద్దరు హీరోలు.. వీరి మధ్య ప్రేమ. ఇదే స్టోరీ ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. అయితే దీనికి కాస్త కామెడీని దట్టించాడు డైరెక్టర్. మూవీ రన్ టైమ్ మెుత్తంలో ఒకటి, రెండు సీన్స్ మినహా సినిమ ఆద్యంతం నవ్వులే నవ్వులు. చిన్న చిన్న సంతోషాలే జీవితం అనుకునే ఓ సాధారణ యువతి కథ మై డియర్ దొంగ. ఇక కథ విషయంలోకి వెళితే.. ఓ హోటల్ లో తన సుజాత తన కథను తానే వివరించడంతో మెుదలౌతుంది. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతున్న క్రమంలో అభినవ్ ఎంట్రీతో మూవీలో వేగం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆమె ఫ్లాట్ లోకి అభినవ్ వచ్చాడ.. అక్కడి నుంచి నవ్వులు కూడా స్టార్ట్ అవుతాయి.

మెకానికల్ ఇంజినీర్ గా అభినవ్ ను సుజాత తన ఫ్రెండ్స్ కు పరిచయం చేయడం, ఇక వారిని నమ్మించేందుకు అభినవ్ చేసే ప్రయాత్నాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇలా సరదాగా సాగుతున్న సమయంలో ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతోంది. అభినవ్ గురించి అసలు విషయం తెలుసుకున్న విశాల్ ఏం చేశాడు అనేది సెకండాఫ్ లో చూపించారు. అభినవ్ ను ఇరికించాలని చూసి విశాల్ పోలీసులకు ఇరుక్కోవడం, సుజాత అతడిపై కోపం పెంచుకోవడం ఇలా సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతూ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ కు వచ్చేసరికి కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు. కానీ క్లైమాక్స్ ను మాత్రం కామెడీ ట్రాక్ లోనే తీశారు.

నటీ, నటుల పనితీరు:

అభినవ్ గోమఠం తనదైన శైలిలో నటించాడు. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. ఇక సుజాత పాత్రలో షాలిని ఒదిగిపోయిందనే చెప్పాలి. తన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా.. నటనతో ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించిన విశాల్ పాత్ర చేసిన నిఖిల్ పర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, శశాంక్, వంశీధర్ గౌడ్ లు తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగతావారు వారివారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక వర్గం పనితీరుకొస్తే.. అజయ్ అరసాడ మ్యూజిక్ వినసొంపుగానే ఉంది. అయితే గుర్తుపెట్టుకునే పాటలు ఏమీ లేవు. ఎస్ఎస్ మనోజ్ కెమెరా పనితం ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి గోజల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తోంది. చివరిగా డైరెక్టర్ బీఎస్ సర్వాంగ కుమార్ తొలి ప్రయత్నంలో కొంత విజయం సాధించాడనే చెప్పుకోవాలి. అయితే అతడు ఎంచుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు.

బలాలు

  • అభినవ్ గోమఠం నటన
  • తక్కువ నిడివి
  • కామెడీ

బలహీనతలు

  • తెలిసిన స్టోరీ కావడం
  • స్లో నెరేషన్

చివరి మాట: అభిమానుల మనసు దోచుకోవడంలో ఈ ‘దొంగ’ కాస్త వెనకబడ్డాడు.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి