iDreamPost

GTA మూవీ రివ్యూ

GTA మూవీ రివ్యూ

టాలీవుడ్ లో కొత్త కథలకు, కొత్తరకం సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు కంటెంట్ పరంగా సినిమాలు చేస్తే.. ఎలా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటెంట్ పరంగా కొత్తగా ఉన్నా.. కొన్నిసార్లు కొన్ని సినిమాలు రీచ్ లేక జనాలకు తెలియకుండా ఉండిపోతాయి. తాజాగా GTA(గన్స్ ట్రాన్స్ యాక్షన్) అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాని స్వీయనిర్మాణంలో తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసుకున్న GTA మూవీ.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

ఈ సినిమా కథ.. నలుగురు ఫ్రెండ్స్(రాహు, కేతు, శని, అంగారా) చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుండి ఆనాధలుగా పెరిగిన ఈ నలుగురు.. సమాజం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని.. ఎలాంటి గుర్తింపు లేక క్రైమ్ చేయడం మొదలుపెడతారు. ముందు చిన్నచిన్న దొంగతనాలతో మొదలై.. మెల్లగా మనుషులను చంపే స్థాయికి వెళ్తారు. కట్ చేస్తే.. హీరోహీరోయిన్ రిషి, జాను ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకొని హీరో ఫ్యామిలీ.. ముందు చెప్పిన గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో హీరో ఫ్యామిలీకి, గ్యాంగ్ కి మధ్య ఏం జరిగింది? వాళ్ల లైఫ్ లో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఆఖరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇప్పటివరకు ఇండస్ట్రీలో సైకో థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. అందులో చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్స్ అయ్యాయి. కంటెంట్.. స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ అనేవి ఎప్పుడూ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఈ GTA కూడా అలాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లిస్ట్ లో చేరాల్సిన సినిమా. ట్రైలర్ తోనే దాదాపు దర్శకుడు సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేసేసాడు. నలుగురు ఫ్రెండ్స్.. సమాజంలో గుర్తింపు లేక సోషియో పాథ్(అంటే.. సైకోలుగా కాదు.. సమాజం పట్ల తెలివి ఉండి ఇలా క్రైమ్ లకు పాల్పడుతుంటారు)లుగా మారతారు. సినిమా ఓపెనింగ్ సీన్ నుండి స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు.

ఫస్టాఫ్ విషయానికి వస్తే.. ముందుగా నలుగురు ఆనాధలుగా రాహు, కేతు, శని, అంగారా క్యారెక్టర్స్ ని.. వాటి బ్యాక్ డ్రాప్ స్టోరీని ఇంటరెస్టింగ్ గా పరిచయం చేశాడు దర్శకుడు. ఆ నాలుగు క్యారెక్టర్స్ బిహేవియర్.. వాళ్లు గ్యాంగ్ గా ఏర్పడి క్రైమ్ లకు పాల్పడుతున్న విధానం.. వాటి వెనుక కారణం చూపిస్తూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలా క్యారెక్టర్స్ ని ఇంటరెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎస్టాబ్లిష్ చేసారు. ఆ తర్వాత లీడ్ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. హీరో రిషి, హీరోయిన్ జాను క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ తో పాటు కాలేజీ లవ్.. పెళ్లి చేసుకోవడం.. ఇలా రెండు విధాలా స్క్రీన్ ప్లేని బాలన్స్ చేసిన విధానం బాగుంది.

హీరోహీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యాక.. కథలో వేగం పుంజుకొని ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే.. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఊహించని ట్విస్టు ఒకటి మైండ్ బ్లాక్ చేస్తుంది. ఆ ట్విస్ట్ కాస్త.. సెకండాఫ్ పై ఇంటరెస్ట్ పెంచుతుంది. ఇక్కడే నలుగురు గ్యాంగ్ కి, హీరో ఫ్యామిలీకి మధ్య కథ పరంగా లింక్ పెట్టిన తీరు.. దర్శకుడి క్లారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్టు వల్ల సెకండాఫ్ లో ఏం జరుగుతుంది? అనే ఇంటరెస్ట్ అలాగే కంటిన్యూ అవుతుంది. అక్కడినుండి స్టోరీలో కొన్ని ఊహించని పరిస్థితులు చోటుచేసుకొని.. క్రైమ్ యాక్షన్ స్టోరీ కాస్త రివేంజ్ స్టోరీగా టర్న్ అవుతుంది.

సెకండాఫ్ లో హీరో ఫ్యామిలీకి, గ్యాంగ్ కి మధ్య వార్ ఎలా సాగింది అనేది.. ఇంటరెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. క్లైమాక్స్ కి వచ్చేసరికి రివేంజ్ డ్రామా.. ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా ముగించారు. నటినటుల విషయానికి వస్తే.. హీరో రిషి క్యారెక్టర్ లో చైతన్య, జాను క్యారెక్టర్ లో హీనా రాయ్ తమ తమ పాత్రలలో బాగా చేశారు. నలుగురు గ్యాంగ్ క్యారెక్టర్స్ చేసిన వారు వేరియేషన్స్ తో ఆకట్టుకున్నారు. కానీ.. ఒక్కరూ కూడా తెలిసిన ముఖం లేకపోవడం మేజర్ మైనస్. ఆల్రెడీ ఆడియన్స్ కి రిజిస్టర్ అయిన ఫేసెస్ కనిపిస్తే.. సినిమాకి ఇంకాస్త బజ్ క్రియేట్ అయ్యేది. సినిమాకు మార్క్ కే రాబిన్ సాంగ్స్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యాయి.

టెక్నికల్ గా GTA నిర్మాణ విలువలు ఉన్నంతలో రిచ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ ఓకే. ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దీపక్ సిద్ధాంత్.. దర్శకుడిగా తన వంతు బాధ్యతను వందశాతం నిర్వహించాడు. తాను ఎంచుకున్న కథ.. రాసుకున్న కథనం ప్రకారం సినిమాను.. మంచి క్యారెక్టర్స్ తో చివరిదాక ఇంటరెస్టింగ్ గా సాగించాడు. సో.. ప్రేక్షకులకు బోర్ రాకుండా ఓవైపు కథను.. మరోవైపు ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్ లు డిసైన్ చేసిన తీరు బాగుంది. మరి రెగ్యులర్ యాక్షన్ సినిమాలు కాకుండా.. కొత్త రకం థ్రిల్లింగ్ స్టోరీస్ ని ఇష్టపడేవారికి GTA బాగా నచ్చుతుంది. చూడాలి మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో!

ప్లస్ లు:

  • స్టోరీ థీమ్
  • డైరెక్షన్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • యాక్షన్ సీక్వెన్సులు

మైనస్ లు:

  • అందరు కొత్తవాళ్లు కావడం
  • ఎక్కువ వయిలెన్స్

చివరిమాట: GTA.. యాక్షన్ లవర్స్ కి ఐ-ఫీస్ట్!

రేటింగ్: 3/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి