iDreamPost

చీటింగ్ కేసులో వివాదాస్పద జడ్జి , ఆయన కుమారుడు అరెస్ట్

చీటింగ్ కేసులో  వివాదాస్పద జడ్జి , ఆయన కుమారుడు అరెస్ట్

చిత్తూరు జిల్లాకు చెందిన వివాదాస్పద మాజీ జడ్జి రామకృష్ణ మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఆయనపై పలు ఆరోపణలున్నాయి. తాజాగా ఫోర్జరీ చేసి మోసం చేశారనే అభియోగంపై ఆయన అరెస్ట్ అయ్యారు. రామకృష్ణతో పాటుగా ఆయన తనయుడు వంశీకృష్ణను కూడా మదనపల్లి టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తమ సమీప బంధువుకి సంబంధించిన పెన్షన్ విషయంలో ఆమె సంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలో దిగారు. బాధితురాలిని మోసం చేసి పెన్షన్ సొమ్ములు కాజేశారని కెనరా బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ సొంత చిన్నమ్మ సుచరితమ్మ ఫోర్జీర సంతకంతో పెన్షన్ డబ్బులు రూ. 4.5 తీసుకున్నారని మదనపల్లి బ్రాంచీ అధికారులు పోలీసులను ఆశ్రయించడంతో అరెస్ట్ చేసి కోర్టుకి హాజరపరిచారు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పీలేరు సబ్ జైలుకి తరలించారు.

రామకృష్ణ ప్రారంభం నుంచి పలు వివాదాలకు కేంద్రంగా ఉంటున్నారు. ఆయన చుట్టూ తీవ్ర చర్చ సాగింది. ఇటీవల ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో బీసీ నాయకుడు, రిటైర్డ్ జడ్జి ఈశ్వరప్ప ఆడియో వాయిస్ రికార్డ్ చేసి కలకలం రేపారు. అయితే చివరకు ఆయనే ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో ఇరుక్కోవడం విస్మయకరంగా మారింది. అది కూడా సమీప బంధువు, పెన్షనర్ అయిన మహిళను మోసం చేసిన కేసులో కావడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రాజకీయంగా రామకృష్ణ ఉదంతాన్ని వాడుకోవడానికి ప్రయత్నించిన విపక్ష టీడీపీ నేతలు, చంద్రబాబు కి ఈ వ్యవహారం షాకిచ్చినట్టేనని కొందరు భావిస్తున్నారు. రామకృష్ణను ముందుపెట్టి ప్రభుత్వాన్ని, కొందరు నేతలను బద్నాం చేయాలని చూసిన బాబు ఈ కేసు తర్వాతనయినా కళ్లు తెరుచుకుంటాడనే గ్యారంటీ లేదని మదనపల్లికి చెందిన పలువురు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి