iDreamPost

Service Charge టిప్ అడ‌గ‌కూడ‌దు, స‌ర్వీస్ ఛార్జీలను బిల్లులో క‌ల‌ప‌కూడ‌దు, రెస్టారెంట్ల‌కు కీల‌క ఆదేశాలు

Service Charge టిప్ అడ‌గ‌కూడ‌దు, స‌ర్వీస్ ఛార్జీలను బిల్లులో క‌ల‌ప‌కూడ‌దు, రెస్టారెంట్ల‌కు కీల‌క ఆదేశాలు

హోటళ్లు, రెస్టారెంట్ల ఫుడ్ బిల్లులో భాగంగా, డిఫాల్ట్‌గా, సర్వీస్ ఛార్జ్ చెల్లించమని కస్టమర్లను అడగడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఫుడ్ బిల్లుతోపాటు కస్టమర్లను సర్వీస్ చార్జీలు చెల్లించాలని హోటళ్లు, రెస్టారెంట్లు బ‌ల‌వంతం చేయ‌కూడ‌దు. బలవంతంగా టిప్ వసూలు చేస్తున్న రెస్టారెంట్లపై, ఫిర్యాదులు పెరగడంతో, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త‌ మార్గదర్శకాలను విడుదల చేసింది.

దీనిపై ఇప్ప‌టిదాకా చట్ట‌ప‌ర‌మైన విధానాల్లేవు. కాబ‌ట్టి సేవలకు ఛార్జీ చట్టపరమైన‌దేన‌ని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) వాదించ‌డంతో గంద‌ర‌గోళం. అందుకే తాజా మార్గదర్శకాలు క్లారిటీ ఇచ్చాయి. బిల్లుతోపాటు స‌ర్వీస్ ఛార్జ్ అనో, టిప్ అనో, మ‌రొక‌ట‌నో వసూలు చేస్తే, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో ఫిర్యాదు చేయొచ్చు. ఒక్క‌మాట‌లో ఏ హోటళ్లు లేదా రెస్టారెంట్లు ఆటోమేటిక్‌గా లేదా బిల్లులో డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్‌ను క‌ల‌ప‌కూడ‌దు. ఏ పేరుతోనూ సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదని మార్గ‌ద‌ర్శ‌కాలు చెబుతున్నాయి.

హోటల్‌లు, రెస్టారెంట్‌లు ఇప్పుడు కస్టమర్‌లను స‌ర్వీస్ ఛార్జ్ చెల్లించ‌మ‌ని అడ‌లేవు. ఏదైనా టిప్ ఇవ్వాలా? వ‌ద్దా అన్న‌ది క‌స్ట‌మ‌ర్ల ఇష్టం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి