iDreamPost

పండుగ వేళ విషాదం: సిలిండర్ పేలి.. 31 మంది దుర్మరణం!

పండుగ వేళ విషాదం: సిలిండర్  పేలి.. 31 మంది దుర్మరణం!

పండగలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది.. ఇళ్లలో పిల్లల, ఇతర కుటుంబ సభ్యుల సందడి. పండగలు, తిరునాళ్లలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఎక్కడెక్కడో ఉన్న బంధువులు ఇంటికి వచ్చి సందడి చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పండగ వేళ విషాదాలు  చోటుచేసుకుంటాయి. అలానే  చైనాలోని ఓ ప్రాంతంలో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. రెస్టారెంట్ లో సిలిండర్ పేలి.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయలయ్యాయి. మరి.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

చైనాలోని నార్త్ వెస్ట్రన్ నగరమైన ఇంచువాన్ లో డ్రాగన్ బోట్ పండగ జరుగుతోంది. ఈ ఫెస్టివల్  కోసం మూడు రోజుల పాటు సెలవులు  కూడా ప్రకటించారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు, బంధువులు  ఇంచువాన్ లోని ప్రజలక ఇళ్లకు వచ్చారు. అలానే ఆ ప్రాంతంలోని  రెస్టారెంట్లు  స్థానికులతో నిండిపోయాయి. అలానే ఓ చిన్న రెస్టారెంట్లో కూడా పెద్ద ఎత్తున జనాలు నిండారు. ఈ క్రమంలో వంట గదిలో ఓ గ్యాస్ సిలిండర్ లీకైంది.  అంతేకాక క్షణాల వ్యవధిలో సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రెస్టారెంట్  అంతా మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో 31 మంది అగ్నికి ఆహుతయ్యారు.  మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది.

ఎగసి పడుతున్న మంటలను  అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేశారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో  ఈ ప్రమాదం జరగ్గా.. గురువారం ఉదయం 4 గంటల సమయానికి మంటలు పూర్తిగా చల్లారాయి. పండగక కోసం వచ్చిన బంధువులు, స్నేహితులే  ఎక్కువగా మృతుల్లో ఉన్నారు. ఓ వైపు వీధిలో గ్లాస్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్న శకలాలు.. మరోపక్క అయినవాళ్ల కోసం గుండెలు పగిలేలా  రోధిస్తున్న బంధువులతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనపై చైనా అధ్యక్షడు జీ జింగ్ పిన్ తీవ్ర సంతాపం  వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అండగా  ఉంటామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఎంతో సంతోషంగా గడపటానికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇలా మృత్యువు ఒడికి చేరడం అందరిని కలచి వేసింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి