iDreamPost

షికారు చేస్తున్న OTT పుకార్లు

షికారు చేస్తున్న OTT పుకార్లు

కరోనా కలకలం లేకపోతే ఈ పాటికి పది దాకా సినిమాలు థియేటర్లలో సందడి చేసేవి. ఎక్కడి జనం అక్కడ ఇళ్లలోనే లాక్ అయిపోవడంతో పాటు నిబంధనలు ఇంకా కఠినంగా మారడంతో నిర్మాతలు చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ఇలా రిలీజ్ ఆగిపోయిన సినిమాలన్నీ త్వరలో డిజిటల్ లో చూసే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా మొదలవడంతో ప్రేక్షకులు నిజమా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ టీం తమ ఒరేయ్ బుజ్జిగాని ఓటిటిలో విడుదల చేసే ఆలోచన లేదంటూ ఖచ్చితంగా వెండితెర మీదే చూపిస్తామని క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు రామ్ రెడ్ కు ఓ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఏకంగా 20 కోట్లు ఆఫర్ చేసిందన్న న్యూస్ కథ గట్టిగానే వినిపించింది. నిజానికి ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు. తమ వీడియోలకు అమాంతం పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఇలాంటివి ప్రతిపాదన చేసినా చేయొచ్చు. కాని ఈ న్యూస్ చాప కింద నీరులా అమాంతం సోషల్ మీడియాలో హై లైట్ అవ్వడంతో రామ్ రంగంలోకి దిగి స్పష్టంగా చెప్పేశాడు. రెడ్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటిస్ ని పూర్తి చేసుకుందని, బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు ఎదురు చూస్తున్నామని, ప్రస్తుతం గవర్నమెంట్ ఆదేశాలను గౌరవిస్తూ క్వారెన్టైన్ లో ఉన్నామని చెబుతూ కుండ బద్దలు కొట్టేశాడు.

సో రెడ్ ని చిన్న తెరపై చూసే ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. తమిళ తడం రీమేక్ గా రూపొందిన రెడ్ మీద ట్రేడ్ భారీ పెట్టుబడి పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సినిమా కావడంతో ఓపెనింగ్స్ భారీగా ఆశిస్తోంది. ఇక యాంకర్ ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా యూనిట్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాటతో యుట్యూబ్ దుమ్ముదులిపి రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు అంతో ఇంతో హైప్ రావడానికి ఈ సాంగే కారణం. డిజిటల్ రిలీజ్ కు సంబంధించి వీళ్ళెమీ చెప్పలేదు. ఇవి కాకుండా రిలీజ్ ఆగిపోయిన ఉప్పెన, నిశబ్దం, అరణ్య ఇలా చాలా పెద్ద లిస్టే థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాయి. వీటికి కూడా ఆఫర్స్ వచ్చాయని టాక్ మొదలైంది కాని సదరు టీమ్స్ మౌనాన్నే ఆశ్రయించాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి