iDreamPost

కొరడా ఝుళిపించిన RBI.. ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు!

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ ఊహించని షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ యాక్ట్ లోని రూల్స్ ను ఉల్లంఘించిన బ్యాంకులపై భారీ జరిమానాల తోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు కూడా రద్దు చేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ ఊహించని షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ యాక్ట్ లోని రూల్స్ ను ఉల్లంఘించిన బ్యాంకులపై భారీ జరిమానాల తోపాటు పలు బ్యాంకుల లైసెన్సులు కూడా రద్దు చేసింది.

కొరడా ఝుళిపించిన RBI.. ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు తగిన నియమాలను రూపొందిస్తుంటుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ మేరకు ఆ బ్యాంకులు నడుచుకోవాలి. ఒకవేళ రూల్స్ అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటుంది. భారీగా జరిమానా విధించడం లేదా బ్యాంకు లైసెన్స్ లను రద్దు చేయడం వంటి చర్యలకు కూడా ఆర్భీఐ వెనకాడదు. ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు నష్టపోవడం, దివాలా తీయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2023లో నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన బ్యాంకులకు ఊహించని షాక్ ఇచ్చింది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది.

2023లో ఆర్బీఐ మొత్తం 17 బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ ఉల్లంఘించిన బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది. ఇందులో లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్‌ బ్యాంక్‌, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌ మొదలైనవి ఉన్నాయి. బ్యాంకింగ్ చట్టంలోని రూల్స్ ను అతిక్రమించడం, సరైన ఆదాయ మార్గాలు లేకపోవడం, మూలధనం లేకపోవడం వంటి కారణాలతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. మరి ఆర్బీఐ గతేడాది 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి