iDreamPost

మీ పిల్లలకు సెరిలాక్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త.. వెలుగులోకి సంచలన నివేదిక

  • Published Apr 18, 2024 | 1:43 PMUpdated Apr 18, 2024 | 1:43 PM

మీరు మీ పిల్లలకు సెరిలాక్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఇకపై మానేయండి. ఎందుకంటే. సెరిలాక్ చాలా డేంజర్ అంటూ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

మీరు మీ పిల్లలకు సెరిలాక్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఇకపై మానేయండి. ఎందుకంటే. సెరిలాక్ చాలా డేంజర్ అంటూ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 1:43 PMUpdated Apr 18, 2024 | 1:43 PM
మీ పిల్లలకు సెరిలాక్ పెడుతున్నారా.. అయితే జాగ్రత్త.. వెలుగులోకి సంచలన నివేదిక

ఎనర్జీ డ్రింక్స్.. పిల్లలను, తల్లిదండ్రులను ఆకట్టుకోవడం కోసం రకరకాల యాడ్స్ ఇస్తూ.. వారిని ఆకర్షిస్తుంటాయి. రకరకాల ఫ్లేవర్స్, పేర్లతో.. రంగురంగుల డబ్బాల్లో వాటిని నింపి.. కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్ వాడితే.. పిల్లలు హైట్, తెలివితేటలు బాగా పెరుగుతాయి అని ప్రకటనలు ఇస్తూ.. కస్టమర్లను మభ్యపెడుతుంటాయి. ఈ క్రమంలో బోర్న్‌విటా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెల్తీ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్‌విటా సహా పలు పానీయాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరోటి చేరింది. అదే సెరిలాక్. దీని గురించి సంచలన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

ఒకప్పుడు ఇంట్లో దొరికే పప్పులతోనే పిల్లలకు ఉగ్గు తయారు చేసి పెట్టేవారు. మారుతున్న కాలంతో పాటు.. ఆహార అలవాట్లు కూడా మారాయి. దాంతో మార్కెట్లో దొరికే రెడిమేడ్ ఫుడ్ మన ఆహారంలో భాగం అయ్యింది. పిల్లలను కూడా ఇది వదలడం లేదు. దీనిలో భాగంగా పిల్లలకు ఉగ్గు బదులు సెరిలాక్ వాడుతున్నారు చాలా మంది. మీరు కూడా మీ పిల్లలకు సెరిలాక్ పెడుతున్నట్లయితే.. ఇక ఆపేయండి. దీనిపై తాజాగా సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న నెస్లే బేబీ-ఫుడ్ ఉత్పత్తుల్లో చక్కెర శాతం అధికంగా ఉన్నట్టు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే, యూకే, జర్మనీ స్విట్జర్లాండ్ సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఇటువంటి ఉత్పత్తులను చక్కెర లేకుండా విక్రయిస్తుందని పబ్లిక్ ఐ పరిశోధనలో వెల్లడయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ వస్తువుల సంస్థ నెస్లే.. అనేక దేశాల్లో శిశువుల పాలు, తృణధాన్యాల ఉత్పత్తులకు చక్కెర, తేనెను కలిపి అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని నివేదిక ఆరోపించింది. అయితే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో మాత్రమే ఈ ఉల్లంఘనలు జరిగినట్టు సదరు నివేదిక పేర్కొనడం గమనార్హం.

దేశంలో అమ్ముడవుతున్న మొత్తం 15 సెరెలాక్ చిన్న పిల్లల ఉత్పత్తుల్లో.. ఒక్కోదానిలో సగటున దాదాపు 3 గ్రాముల చక్కెర ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అదే ఉత్పత్తిని జర్మనీ, యూకే వంటి దేశాల్లో మాత్రం చక్కెర లేకుండా విక్రయిస్తున్నారని నివేదిక తెలిపింది. ఇథియోపియా, థాయ్‌లాండ్‌లలో ఇదే ఉత్పత్తుల్లో 6 గ్రాముల చక్కెర కలిగి ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.

అయితే ఇలాంటి బ్రాండ్స్ తమ న్యూట్రిషన్ సమాచారంలో మాత్రం చక్కెర కలిగి ఉన్న వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. నెస్లే 2022లో రూ.20,000 కోట్ల విలువైన సెరెలాక్ ఉత్పత్తులను విక్రయించింది. పిల్లల ఉత్పత్తులకు చక్కెరను కలపడం ప్రమాదకరమైన పద్దతి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల చిన్నారులకు కేవలం చక్కెర రుచి మాత్రమే అలవాటయ్యి.. వాటిని తినడానికే మొగ్గు చూపుతారని.. దీని వల్ల స్థూలకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ నివేదిక మీద నెస్లే ఇండియా స్పందిస్తూ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. గత ఐదేళ్లలో నెస్లే శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెరలను 30 శాతం తగ్గించిందని, వాటిని మరింత తగ్గించడానికి ఉత్పత్తులను సమీక్ష, పునరుద్ధరణ కొనసాగిస్తుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి