iDreamPost

ముఖేశ్ అంబానీ కుడిభుజం.. మనశ్శాంతి కోసం సన్యాసం

ముఖేశ్ అంబానీ కుడిభుజం.. మనశ్శాంతి కోసం సన్యాసం

కరోనా వచ్చాక ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్లుగా మారింది జీవితం. ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరినీ అంటుకోపోతోంది మాయదారి వైరస్. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా.. కాలం తీరిన తర్వాత చావును అడ్డుకోలేవు. నిజానికి డబ్బు లగ్జరీ లైఫ్ ను ఇవ్వొచ్చు.. ప్రశాంతతను ఇవ్వదు. హోదా ఇవ్వొచ్చు.. కానీ మనశ్శాంతి ఇవ్వదు. ఈ విషయం కొంచెం లేటుగా అర్థమైనట్లు ఉంది పెద్దాయనకు. లేక కరోనా ప్రపంచాన్ని చూసి విసుగు చెందారో ఏమో సన్యాసిగా మారిపోయారు.

ఆయన అలాంటి ఇలాంటి మనిషి కాదు. ఇండియాలో ఎక్కువ సంపద కలిగిన, ప్రపంచ ధనవంతుల్లో ఒకడైన ముఖేష్ అంబానీకి కుడిభుజం లాంటి వ్యక్తి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసిన వ్యక్తి. నెలకు 6 కోట్లకు పైగా జీతం తీసుకున్న వ్యక్తి. ఆయనే ప్రకాశ్ షా. సర్వసంగ పరిత్యాగం చేసి జైన సన్యాసం స్వీకరించి ‘నూతన్ మునిరాజ్’గా మారిపోయారు. ఆయన భార్య కూడా అదే దారిలో నడిచారు. సన్యాసినిగా మారారు.

ఏడాది కిందటే అన్నింటికీ దూరం..

ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చదివారం ప్రకాశ్ షా. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చేరారు. ఆ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. కానీ ఏడాది కిందట కరోనా మొదలైన కొత్తలోనే.. హోదా, సంపద అనే విషయాల నుంచి దూరంగా జరిగారు ప్రకాశ్ షా. రిటైర్ మెంట్ తీసుకున్నారు. తాజాగా దీక్ష తీసుకున్నారు. ప్రకాశ్ షా, ఆయన భార్య నైనా షా.. జైన సన్యాసులుగా మారిపోయారు. షా పేరును భూషణ్ విజయ్ జీ మహరాజ్ సాహెబ్, ఆయన భార్య పేరును భవ్యనిధి సాధ్వీజీ మహరాజ్ సాహెబ్ అని పెట్టారు.

Also Read : ఆప్ కు షాక్ : దేశ రాజ‌ధానిపై ఇక‌ ఎల్జీకే స‌ర్వాధికారాలు

ప్రకాశ్ షా కొడుకు 24 ఏళ్లకే..

ప్రకాశ్ షా చిన్న కొడుకు చాలా ఏళ్ల కిందటే జైన సన్యాసిగా మారిపోయారు. ఈయన కూడా ఐఐటీ బాంబేలో బీటెక్ డిగ్రీ చదివారు. బాగా ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ కూడా సాధించారు. కానీ తన 24వ ఏటనే సన్యాసిగా మారిపోయారు. ఏడేళ్ల కిందట సన్యాసిగా మారిన ఆయనకు భువన్ జీత్ మహరాజ్ అని పేరు పెట్టారు. ‘‘నా తల్లిదండ్రులు నాకు స్ఫూర్తినిచ్చారు. మద్దతు ఇచ్చారు. ఈ మార్గంలో నడవాలని వారు ఆరాటపడ్డారు. ఇప్పుడు వారిని ఈ దారిలో చూడటం సంతోషంగా ఉంది’’ అని ఆయన చెప్పారు.

దేశంలో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. నెలకు రూ.6 కోట్లకు పైగా జీతం. కానీ ఆయనకు ఇవేమీ సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బు, హోదా, ఇతర అవసరాల కంటే ఇంకేదో ముఖ్యమని అనిపించింది. అదే మనశ్శాంతి కావచ్చు. అయితే సన్యాసిగా మారాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదు. ఎందుకంటే ఏడేళ్ల కిందట కొడుకు సన్యాసిగా మారినప్పుడే అడ్డుచెప్పలేదు. పైగా ప్రోత్సహించారని కొడుకే చెబుతున్నారు. అంటే అదే దారిలో వెళ్లాలని ప్రకాశ్ కూడా అనుకున్నారు. తన ధర్మపత్నితో కలిసి సన్యాసం పుచ్చుకున్నారు. మరి ఆస్తి మొత్తం ఏమవుతుంది? అన్న ప్రశ్నకు.. చూసుకోవడానికి పెద్ద కొడుకు ఉన్నాడు.. అనేది జవాబు.

Also Read : మోడీ భ్రమల నుంచి భారత్ బయటపడుతోందా.. ?!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి