iDreamPost
android-app
ios-app

అతడిని ఛాన్స్ అడిగితే.. అడ్జస్ట్ మెంట్ కోరాడు: రెజీనా

అతడిని ఛాన్స్ అడిగితే.. అడ్జస్ట్ మెంట్ కోరాడు: రెజీనా

ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు కాస్టింగ్ కౌచ్. అవకాశాల కోసం మమ్మల్ని వాడుకున్నారని కొందరు, అవకాశం ఇవ్వాలి అంటే అడ్జస్ట్ కావాల్సిందే అన్నారని మరికొందరు హీరోయిన్లు కామెంట్స్ చేయడం చూసూనే ఉన్నాం. అయితే ఇలాంటి కామెంట్స్ సపోర్టింగ్ రోల్స్ చేసే వాళ్ల దగ్గరి నుంచి స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న వాళ్లు కూడా చేశారు. తాజాగా ఈ లిస్టులోకి చెన్నై బ్యూటీ రెజీనా చేరింది. తనకి కూడా ఇలాంటి ఛేదు అనుభవం ఉందంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైనా ఘటన గురించి వివరించింది.

రెజీనా పేరుకి చెన్నై అమ్మాయి అయినా.. తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ కెరీర్ ని కోలీవుడ్ లో ప్రారంభించినా కూడా.. టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో చాలా మంది యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే రెజీనాకు వెబ్ సిరీస్ లలో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. తెలుగులోనే కాకుండా.. తమిళ్, హిందీలోనూ రెజీనా వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా రెజీనా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభం సమయంలో ఆమెకు ఎలాంటి ఛేదు అనుభవాలు ఎదురయ్యాయో ప్రేక్షకులతో పంచుకుంది. ఆ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ పై కూడా ఆమె ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆమెకు ఎదురైనా అనుభవం మాత్రమే కాకుండా.. కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పే ప్రయత్నం చేసింది.

కాస్టింగ్ కౌచ్ పై రెజీనా మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం నేను కొందరిని సంప్రదించాను. ఆ సమయంలో ఒకతను నాకు కాల్ చేశాడు. ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. అయితే అందుకు అడ్జస్ట్ మెంట్ కి ఓకే చెప్పాలని కోరాడు. అందుకు ఓకే అంటే తర్వాత వెంటనే షూటింగ్ ప్రారంభించవచ్చని చెప్పాడు. నాకు అప్పుడు అసలు అడ్జస్ట్ మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను రెమ్యూనరేషన్ విషయం అనుకున్నాను. మా మేనేజర్ మాట్లాడతాడు అని ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత మా మేనేజర్ నాకు అసలు వాళ్లు ఏం అడుగుతున్నారో చెప్పాడు. అప్పుడు నా వయసు 20 ఏళ్లు. ఆ తర్వాత నాకు మళ్లీ అలాంటి ఘటన ఎదురు కాలేదు. అయితే ఇండస్ట్రీలో చాలామందికి ఇలాటి పరిస్థితులు ఎదురుకావచ్చు. కొందరు కావాలని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండచ్చు. ఫేమ్ కోసం అబద్ధాలు కూడా చెబుతూ ఉంటారు. అది నిజమా, అబద్ధమా అనేది కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది” అంటూ రెజీనా కామెంట్ చేసింది. ప్రస్తుతం రెజీనా చేసిన కాస్టింగ్ కౌచ్ ఓపెన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş