iDreamPost

హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దంటూ GHMC హెచ్చరికలు

  • Author Soma Sekhar Published - 08:23 AM, Tue - 5 September 23
  • Author Soma Sekhar Published - 08:23 AM, Tue - 5 September 23
హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దంటూ GHMC హెచ్చరికలు

అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ ను కుండపోత వర్షం ముంచెత్తుతోంది. గ్యాప్ లేకుండా వాన దంచికొడుతుండటంతో.. భాగ్యనగరం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులన్ని జలమయం కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. మరో గంటలో నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావొద్దని GHMC అధికారులు సూచించారు.

తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆదివారం నుంచి నగరంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది. మూడు గంటల పాటు ఈ భారీ వర్షం కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది జీఎచ్ఎంసీ.

ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలను జీఎచ్ఎంసీ అప్రమత్తం చేసింది. భారీ వర్షాల కారణంగా కాలనీల్లోకి, సెల్లార్లలోకి వరదనీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో.. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్, మారేడుపల్లి, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్డు, కూకట్ పల్లి, చిలకలగూడ ప్రాంతాలతో పాటుగా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.


ఇదికూడా చదవండి: రెయిన్ అలెర్ట్: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి