iDreamPost

భర్తలు మ్యారేజ్ డేట్ మర్చిపోవడం వెనుక బలమైన కారణాలు!

Reasons Behind Men Forget Important Dates: పెళ్లి రోజు మర్చిపోయిన భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలిన పని లేదు. పెళ్లి రోజే మర్చిపోతావా అని వంటింట్లో సామాన్లన్నీ భర్త మీదకు వెళ్లిపోతాయి. అయితే భర్తలు పెళ్లి రోజులు, పుట్టినరోజులు మర్చిపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. భర్తలే కాదు.. మగ పుట్టుక పుట్టిన ప్రేమికులకు కూడా ప్రియురాలి పుట్టినరోజు గుర్తుండి చావదు. దయచేసి వాళ్ళని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళు కావాలని మర్చిపోరు. దీనికి గల బలమైన కారణాలు తెలిస్తే అయ్యో పాపం అనక మానరు.

Reasons Behind Men Forget Important Dates: పెళ్లి రోజు మర్చిపోయిన భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలిన పని లేదు. పెళ్లి రోజే మర్చిపోతావా అని వంటింట్లో సామాన్లన్నీ భర్త మీదకు వెళ్లిపోతాయి. అయితే భర్తలు పెళ్లి రోజులు, పుట్టినరోజులు మర్చిపోవడానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. భర్తలే కాదు.. మగ పుట్టుక పుట్టిన ప్రేమికులకు కూడా ప్రియురాలి పుట్టినరోజు గుర్తుండి చావదు. దయచేసి వాళ్ళని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళు కావాలని మర్చిపోరు. దీనికి గల బలమైన కారణాలు తెలిస్తే అయ్యో పాపం అనక మానరు.

భర్తలు మ్యారేజ్ డేట్ మర్చిపోవడం వెనుక బలమైన కారణాలు!

మతిమరుపు.. చాలా మందిలో ఉండే అతి సాధారణ సమస్య. ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఈ మతిమరుపు సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. భార్య పెళ్లి రోజు, పుట్టినరోజు తేదీలు గుర్తుండకపోవడం, ఏదో వస్తువు తీసుకురమ్మని చెప్తే మర్చిపోవడం, ఆఫీస్ లో బాస్ చెప్పిన పనిని మర్చిపోవడం.. ఇలా పలు సందర్భాల్లో మతిమరుపు సమస్యని ఎదుర్కుంటారు. అయితే ఈ సమస్య ఆడవారిలో ఉండదా? మగాళ్లలోనే ఎందుకు? మగాళ్లే ఎక్కువగా మర్చిపోవడానికి కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

ఆడవాళ్ళ కంటే మగాళ్లే ఎక్కువగా మతిమరుపు సమస్యని ఎదుర్కుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మతిమరుపు సమస్య మహిళల కంటే మగాళ్లకే అధికంగా ఉంటుందని పలు స్టడీస్ చెబుతున్నాయి. మెమరీ డిస్ ఫంక్షన్.. ఇది మెదడు వృద్ధాప్యానికి, డిమెన్షియాకి మధ్య వచ్చేది. దీన్ని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్ అని కూడా పిలుస్తారు. ఇది డిమెన్షియాకి దారి తీస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కోల్పోవడం, ఆలోచించకలేకపోవడం, రోజూ చేసే పనుల విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే మగాళ్లలో ఈ మతిమరపు సమస్య 30 ఏళ్ల నుంచి మొదలవ్వడం గానీ లేదా 60 ఏళ్ల నుంచి మొదలవ్వడం గానీ జరుగుతుందని అధ్యయనాల్లో తేలింది.

నార్వేలో జరిపిన హంట్ 3 అనే స్టడీస్ ప్రకారం మగవాళ్ల కంటే ఆడవాళ్లకే జ్ఞాపకశక్తి ఎక్కువని తేలింది. మగవారిని, ఆడవారిని కలిపి మొత్తం 37,405 మంది జ్ఞాపక శక్తిని టెస్ట్ చేయగా.. ఆడవారికే ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఆడవారికి, మగవారికి జ్ఞాపకశక్టి విషయంలో ఒక టెస్ట్ పెట్టారు. ఈ టెస్టులో జ్ఞాపక శక్తికి సంబంధించి 9 ప్రశ్నలు అడిగారు. టీనేజ్ వయసులో ఉన్నప్పుడు మతిమరుపు మొదలైందా? డేట్స్ ని మర్చిపోతున్నారా? కొన్ని రోజుల క్రితం, కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తున్నాయా? లేవా? అనే విషయాలపై పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో మగాళ్లు దాదాపుగా ఫెయిలయ్యారు.

ఈ అధ్యయనంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిలో సగం మందికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉందని తేలితే.. ఇందులో 1.6 శాతం మంది అబ్బాయిలకు, 1.2 శాతం మంది అమ్మాయిలకి మతిమరుపు ఉన్నట్లు తేలింది. అయితే ఈ మతిమరుపు సమస్య వయసు పెరిగే కొద్దీ పెరుగుతుందని.. అందులోనూ మగవారికే ఈ సమస్య అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మతిమరుపుకి గల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పలేదు కానీ అధిక రక్తపోటు లేదా బీఎంఐ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్.. మెదడుకు సంబంధించిన న్యూరో డిజెనరేషన్ మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఈ కారణంగా మతిమరుపు వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ ని గానీ, ఒక పర్టిక్యులర్ తేదీని గానీ మగాళ్లు మర్చిపోవడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉందని నార్వే యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ టీమ్ ప్రొఫెసర్ జోస్టన్ హొల్మెన్ వెల్లడించారు.

Why mens dont remind marriage day

అయితే ఈ మతిమరుపు ముదిరితే డిమెన్షియాకి దారి తీస్తుందని, ఇది ఇంకా ప్రమాదకరమని పరిశోధకులు అంటున్నారు. మానసిక, శారీరక ఒత్తుడుల కారణంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని.. ఆఫీస్ పని, ఇంటి బాధ్యతలు, కెరీర్ గోల్స్ ఇలా రకరకాల ఒత్తుడుల కారణంగా మతిమరుపు వస్తుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఈ స్టడీస్ ప్రకారం మగాళ్లు ఎందుకు మర్చిపోతారు అనేది ఖచ్చితంగా తెలియదు కానీ ఆడవారితో పోలిస్తే మగాళ్లలో జ్ఞాపకశక్తి అనేది తక్కువ. అనారోగ్య సమస్యలు, ఒత్తుడుల కారణంగానే మగవారు ముఖ్యమైన డేట్స్ ని మర్చిపోతున్నారట. కాబట్టి ఈ విషయంలో ఆడవారు మగవారిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రేయసి పుట్టినరోజు మర్చిపోయినందుకు మిమ్మల్ని ఆడిపోసుకున్నా.. మీ సతీమణి పెళ్లి రోజు మర్చిపోయినందుకు అలిగినా వారికి ఈ కథనాన్ని షేర్ చేసి అవగాహన కల్పించండి. మరి దీనిపై  మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.     

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి