iDreamPost

చిరంజీవి మౌనం అందుకేనా

చిరంజీవి మౌనం అందుకేనా

ఉన్నట్టుండి చిరంజీవినే కాదు మొత్తం టాలీవుడ్ నే మౌనం ఆవహించినట్టు అయ్యింది. ఇటీవలే తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ తో ఇండస్ట్రీ పెద్దలు జరిపిన మీటింగులు, సహాయా కార్యక్రమాల్లో తనను పిలవలేదని, ఏవో భూముల గురించొ మాట్లాడుకున్నారని బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక ఒక్కసారి అగ్గి రాజుకుంది. కొందరు కోరుకున్నట్టు దీని మీద పరిశ్రమ రెండుగా చీలకపోయినా ఓ మీడియా వర్గం మాత్రం ఇష్యూని భూతద్దంలో చూపించి వివాదం పెద్దది కావడంతో తన వంతు పాత్ర పోషించింది.ఇది చాలదు అన్నట్టు నాగబాబు వార్నింగ్ సైతం తీవ్రతను పెంచింది.

దీని తర్వాతే హటాత్తుగా చిరంజీవి సైలెంట్ అయ్యారు. ట్విట్టర్ లోనూ ఏవో సాటి తారలకు బర్త్ డే విషెస్ చెప్పడం తప్ప ఇంకేమి అప్ డేట్ చేయడం లేదు. సిసిసి తరఫున కూడా కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో బయటికి రావడం లేదు. దీంతో బాలయ్య కామెంట్స్ కు హర్ట్ అవ్వడం వల్లే ఇంతచేసినా మాటలు పడాల్సి వచ్చిందనే ఉద్దేశంతో చిరంజీవి దీనికి స్పందించకూడదని నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాని చిరంజీవి బాలకృష్ణల మధ్య బాండింగ్ ఇప్పటిది కాదు. గత మూడు దశాబ్దాలకు పైగా వాళ్ళ స్నేహం కొనసాగుతోంది. పరిశ్రమకు నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు చిరునే అని బాలయ్య గౌతమిపుత్రశాతకర్ణి ప్రమోషన్ లో పబ్లిక్ గా చెప్పారు. ఆ మధ్య కోడిరామకృష్ణ కూతురి పెళ్లిలో కూడా ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు.

ఈ నేపధ్యంలో బాలకృష్ణ నిజంగా టార్గెట్ చేసింది చిరంజీవినా లేక ఇంకెవరినైనా అనే అనుమానం రాకమానదు. అయితే పెద్దగా వ్యవహరిస్తూ ముందుండి నడిపిస్తున్నందుకు ఫలితం ఏదైనా అది నేరుగా చిరువైపుకే వెళ్తుంది. అందుకే కొన్ని రోజులు దీనికి దూరంగా ఉన్నట్టు వినికిడి. షూటింగులు త్వరలోనే ప్రారంభించేందుకు అనుమతులు వచ్చే అవకాశం ఉండటంతో ఎవరికి వారు తమ తమ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. కొత్త గైడ్ లైన్స్ కు తగ్గట్టు వనరులు సమకూర్చుకోవడంలో తలమునకలవుతున్నారు. ఆచార్యలో తామూ ఒక ప్రొడక్షన్ పార్టనర్ కాబట్టి చిరంజీవికి ఇప్పుడు ఈ పనులు కూడా వచ్చి పడ్డాయి. మొత్తానికి ఏదో ఒక మీటింగ్ తో సందడిగా ఉండే టాలీవుడ్ లో ఇప్పుడు మౌనం రాజ్యమేలుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి