iDreamPost

RRపై ఓటమి.. ఆ RCB ఆటగాళ్లపై వేటు? కోచ్ కామెంట్స్ వైరల్..

రాజస్తాన్ పై ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ కోచ్ ఆండీ ప్లవర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ప్లేయర్లపై వేటు తప్పదు అంటూ ముందుగానే హింట్ ఇచ్చాడు. మరి ఎవరిని టీమ్ నుంచి తప్పించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ పై ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ కోచ్ ఆండీ ప్లవర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆ ప్లేయర్లపై వేటు తప్పదు అంటూ ముందుగానే హింట్ ఇచ్చాడు. మరి ఎవరిని టీమ్ నుంచి తప్పించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

RRపై ఓటమి.. ఆ RCB ఆటగాళ్లపై వేటు? కోచ్ కామెంట్స్ వైరల్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు కల మరోసారి చెదిరింది. 17 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్ ను  ఈసారి కూడా సాధించకుండానే ఇంటిదారి పట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి.. తీవ్ర నిరాశలో ఉంది. కీలకమైన మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్లు రాణించకపోవడంతో.. ఓటమి చెందాల్సి వచ్చింది. ఇక ఈ పరాజయం తర్వాత జట్టును ప్రక్షాళన చేయాలని కోచ్ ఆండీ ప్లవర్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ఆర్సీబీ ఆటగాళ్లను విడిచిపెడుతున్నాం అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. మరి ఎవరెవరిని విడిచి పెట్టబోతున్నారు? చూద్దాం పదండి.

ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోవడంతో.. జట్టులో ప్రక్షాళన చేయబోతున్నట్లు ముందుగానే హింట్ ఇచ్చాడు ఆర్సీబీ కోచ్ ఆండీ ప్లవర్. “మా జట్టుకు విభిన్నమైన బంతులు సంధించే బౌలర్లు కావాలి. తెలివితో బౌలింగ్ వేసే ప్లేయర్లు కావాలి. బౌండరీలు తక్కువగా ఉండే గ్రౌండ్స్ లో హిట్టర్లు బాగా ఉపయోగపడతారు. వచ్చే సీజన్లో జట్టులో మార్పుల ఉండొచ్చు. ఇక జట్టు ప్లే ఆఫ్స్ చేరడానికి కోహ్లీ-డుప్లెసిస్ ఎంతో శ్రమించారు” అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా.. ఆండీ ప్లవర్ చెప్పినట్లుగా జట్టు నుంచి ఉద్వాసన పలికే ఆటగాళ్లు ఎవరంటే? విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్, టామ్ కర్రన్. వీరిద్దరిని నెక్ట్స్ సీజన్ కు రిటైన్ చేసుకోవట్లేదని పరోక్షంగా పేర్కొన్నాడు. జోసెఫ్ ను రూ. 11.50 కోట్ల భారీ ధరకు వేలంలో దక్కించుకుంది ఆర్సీబీ. కానీ ఈ సీజన్ లో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడిన అతడు ఒక్క వికెట్ తీశాడు. ఇక టామ్ కర్రన్ న ఈ సీజన్ లో ఉపయోగించుకోలేదు ఆర్సీబీ. దాంతో అతడిని సైతం నెక్ట్స్ సీజన్ కు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి