iDreamPost

అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోయినా.. UPI ద్వారా ఇలా పేమెంట్ చేయవచ్చు..

అకౌంట్లో ఒక్క రూపాయి లేకపోయినా.. UPI ద్వారా ఇలా పేమెంట్ చేయవచ్చు..

డిజిటల్ భారతే లక్ష్యంగా నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు ఎన్ సీపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో యూపీఐ ద్వారా చెల్లింపుల ప్రక్రియ సులభం అయ్యింది. యూపీఐ అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ పేమెంట్స్ ఘణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో యూపీఐ యాప్స్ వాడే యూజర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఖాతాలో రూపాయి లేకున్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేసే సౌకర్యాన్ని కల్పించింది. బ్యాంకులు యూపీఐ పేమెంట్లకు లోన్లు ఇచ్చేలా ఓ సర్క్యూలర్ ని జారీ చేసింది. క్రెడిట్ కార్డుల మాదిరిగానే యూపీఐ పేమెంట్స్ కి లోన్లు అందించనున్నాయి బ్యాంకులు.

ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే విధంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం కస్టమర్ ముందుగా బ్యాంక్ నుంచి అనుమతి తీసుకున్నట్లైతే ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్లను పొందొచ్చు. దీంతో క్రెడిట్ కార్డు లేని వ్యక్తులు యూపీఐ సాయంతో లోన్స్ ను పొంది చెల్లింపులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అకౌంట్ లో డబ్బు ఉంటేనే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుండేది. కానీ ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఖాతా ఖాళీ అయినా బ్యాంక్ ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్లతో యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ పేమెంట్లకు లోన్లు అందించే బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ పరిమితి, క్రెడిట్ వ్యవధి, వడ్డీ రేటు తదితర వివరాలను బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నెలలో ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు కమర్షియల్ బ్యాంకుల ముందుకు ముందుగా మంజూరైన క్రెడిట్ లైన్ పేమెంట్ల ద్వారా యూపీఐ పరిధిని విస్తరించాలని ప్రతిపాదన తెచ్చింది. తాజాగా దానికి ఆమోదం తెలిపింది ఆర్బీఐ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి