iDreamPost

SBIకి భారీ షాకిచ్చిన RBI.. కోట్ల రూపాయల ఫైన్!.. ఎందుకంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు బ్యాంకులపై కొరఢా ఝుళిపించింది. ఎస్బీఐకి భారీ షాకిచ్చింది. మరో మూడు బ్యాంకులపై కూడా భారీగా జరిమానా విధించింది. ఇంతకీ కారణం ఏంటంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు బ్యాంకులపై కొరఢా ఝుళిపించింది. ఎస్బీఐకి భారీ షాకిచ్చింది. మరో మూడు బ్యాంకులపై కూడా భారీగా జరిమానా విధించింది. ఇంతకీ కారణం ఏంటంటే?

SBIకి భారీ షాకిచ్చిన RBI.. కోట్ల రూపాయల ఫైన్!.. ఎందుకంటే?

గతకొంత కాలంగా భారతదేశపు కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులపై ఉక్కు పాదం మోపుతోంది. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బ్యాంకులకు భారీగా జరిమానాలు విధిస్తుంది. ఈ క్రమంలో బ్యాంకుల లైసెన్స్ లను సైతం రద్దు చేసేందుకు వెనకాడడం లేదు ఆర్బీఐ. సాధారణంగా బ్యాంకులు కస్టమర్లకు లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అందిస్తుంటాయి. వీటికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించనప్పుడు బ్యాంకు రూల్స్ ప్రకారం జరిమానా విధిస్తుంటాయి. ఇదే మాదిరిగా బ్యాంకులు కూడా ఆర్బీఐ నియమాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. తాజాగా ఆర్బీఐ ఎస్బీఐకి భారీ షాక్ ఇచ్చింది. మరో మూడు బ్యాంకులపై కూడా చర్యలు తీసుకుంది.

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్బీఐ కొరఢా ఝుళిపించింది. నిబంధనల్ని అతిక్రమించి కార్యకలాపాలు చేస్తుండడంతో ఎస్‌బీఐ సహా కెనరా బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, ఓషియన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లపై జరిమానా విధించింది. వీటన్నింటికి కలిపి రూ. 3 కోట్ల వరకు ఫైన్ వేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్- 2014 కు సంబంధించి పలు నిబంధనల్ని పాటించలేదని ఎస్‌బీఐపై రూ. 2 కోట్ల వరకు జరిమానా విధించింది ఆర్బీఐ.

అదే విధంగా ఆస్తుల వర్గీకరణ, ఆదాయాల గుర్తింపు, నాన్ పర్ఫామింగ్ అకౌంట్స్ విషయంలో, కేవైసీ విషయంలో ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాల్ని పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంకుకు రూ. 66 లక్షల మేర పెనాల్టీ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన కెనరా బ్యాంకుపై రూ. 32.30 లక్షలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీపై రూ. 16 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇటీవల పేటీఎం పేమెంట్ బ్యాంక్ పై ఆర్బీఐ కొరఢా ఝుళిపించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి