iDreamPost

మరో బ్యాంక్ లైసెన్సును రద్దు చేసి RBI.. మీ డబ్బుల పరిస్థితి ఏంటి?

మరో బ్యాంక్ లైసెన్సును రద్దు చేసి RBI.. మీ డబ్బుల పరిస్థితి ఏంటి?

సాధారణం వెనుకటి రోజుల్లో అంటే డబ్బుని ఇంట్లోనే దాచుకునే వాళ్లు. దొంగల భయం ఉంటే ఇంట్లో గొయ్యి తీస పూడ్చి పెట్టేవాళ్లు. కాలం మారిన తర్వాత బ్యాంకులు వచ్చాయి. అందరూ వారి డబ్బుని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. బ్యాంకుల్లో అయితే వారి నగదుకు భద్రత, గ్యారెంటీ ఉంటుంది అని. కానీ, ఇప్పుడు బ్యాంకుల్లో ఉండే డబ్బుకే గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఏ బ్యాంకు బోర్డు తిప్పేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా ఆర్బీఐ మరో బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది.

ఆర్బీఐ ఇటీవలి కాలంలో చాలా బ్యాంకుల లైసెన్సును రద్దు చేసింది. వారు ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు దివాలా తీసేందుకు దగ్గర్లో ఉన్నవి, సమర్థంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించలేవని భావించిన బ్యాంకుల లైసెన్సును ఆర్బీఐ రద్దు చేస్తూ ఉంటుంది. తాజాగా మహాలక్ష్మి సహకార బ్యాంకు లైసెన్సును ఆర్బీఐ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంకు ఇంక నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీగా మాత్రమే కొనసాగనుంది. ఈ బ్యాంకు లైసెన్సు ఇప్పటికే రద్దైందని.. జూన్ 27 నుంచే ఈ బ్యాంకు ఫైనాన్షియల్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు వెల్లడించింది.

1994లో మహాలక్ష్మి బ్యాంకు.. ఆర్బీఐ వద్ద నుంచి లైసెన్సు పొందగా.. తాజాగా తన లైసెన్సును కోల్పోయింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ సహకార బ్యాంకులపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా బ్యాంకులు లైసెన్సులను కోల్పోయాయి. అయితే ఖాతాదారులు చింతించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బ్యాంకులకు బీమా ఉంటుంది. ఆ బీమా వల్ల మీ డబ్బులు మీకు రికవరీ చేస్తారు. చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తం వరకు వరుస క్రమంలో సెటిల్ చేస్తుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి