iDreamPost

వేగంగా సినిమాలు – ప్లస్సా మైనస్సా?

వేగంగా సినిమాలు – ప్లస్సా మైనస్సా?

ఒకప్పుడు 1985కు ముందు చిరంజీవి కృష్ణ లాంటి హీరోలు ఏడాదికి 10 నుంచి 14 సినిమాలు చేయడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. ఇప్పుడున్న స్టార్లు మహా అయితే ఏడాదికి ఒకటి రెండు కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. నాని లాంటి వాళ్ళు కొంతలో కొంత నయం కానీ ప్యాన్ ఇండియా వచ్చాక అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లకు సైతం రెండుమూడేళ్లు గ్యాప్ తగ్గడం లేదు. కానీ సీనియర్లు ఈ విషయంలో తామే బెటరనిపిస్తున్న మాట వాస్తవం. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజనే తీసుకుంటే కథల గురించి ఎక్కువగా బుర్ర బద్దలు కొట్టుకోవడం లేదు. పాయింట్ నచ్చి బడ్జెట్ ఉందంటే చాలు ఓకే చెప్పేస్తున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ(Ramarao on Duty) విడుదలకు సిద్ధమవగా, ధమాకా(Dhamaka) చివరి దశలో ఉంది. వాల్తేర్ వీరయ్యని ఇటీవలే స్టార్ట్ చేశారు. రావణాసురను దసరాలోపే పూర్తి చేయాలని టార్గెట్. ఇవి కాకుండా మరో రెండు చర్చల స్టేజిలో ఉన్నాయి. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ఈ స్పీడ్ ని నెటిజెన్లు బాలీవుడ్ అక్షయ్ కుమార్ తో పోలుస్తున్నారు. అతను కూడా ఎడాపెడా చేసుకుంటూ పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్విరాజ్ లాంటి దారుణమైన డిజాస్టర్లు తగిలాయి. ఏదైనా కొత్త అనౌన్స్ మెంట్ వస్తే చాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అవుతోంది. అయినా తగ్గేదేలే అన్నట్టుంది అక్షయ్ ధోరణి

ఇక మెగాస్టార్ సైతం ఈ వయసులోనూ దూకుడు తగ్గించడం లేదు. గాడ్ ఫాదర్(GodFather), వాల్తేర్ వీరయ్య(Waltair Veeraiah), భోళా శంకర్(Bhola Shankar) లు సెట్స్ మీద ఉండగా నెక్స్ట్ క్యూలో మారుతీ, వెంకీ కుడుముల, హరీష్ శంకర్ లు ఉన్నారు. అందరికీ కమిట్ మెంట్లు ఇచ్చేశారు. ఏది డ్రాప్ అవుతారో ఇప్పుడే చెప్పలేం. ఒక్కొక్కటి కాకుండా ఇలా అన్నీ క్యూలో పెట్టేయడం వల్ల లాభాలెనున్నాయో నష్టాలు కూడా అంతే ఉంటాయి. క్వాలిటీ తగ్గిపోయి హడావిడి పెరిగిపోయి ఫైనల్ అవుట్ ఫుట్ దెబ్బ కొట్టేస్తుంది. ఇది దర్శకుల మీద పడే ఒత్తిడి కారణంగానే. ఇలా చేయడం వల్ల నలుగురికి ఉపాధి దొరికే మాట వాస్తవమే కానీ థియేటర్లలో ఆడకపోతే వాటి వల్ల వచ్చే డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు బాధ్యత ఎవరిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి