iDreamPost
android-app
ios-app

సర్ఫరాజ్ రనౌట్ పై జడేజా ఎమోషనల్ పోస్ట్! తప్పు ఒప్పుకుంటూ!

  • Published Feb 15, 2024 | 8:24 PM Updated Updated Feb 15, 2024 | 8:24 PM

Ravindra Jadeja apologizes to Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ విషయంలో స్పందించాడు రవీంద్ర జడేజా. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

Ravindra Jadeja apologizes to Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ విషయంలో స్పందించాడు రవీంద్ర జడేజా. ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.

సర్ఫరాజ్ రనౌట్ పై జడేజా ఎమోషనల్ పోస్ట్! తప్పు ఒప్పుకుంటూ!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాని సూపర్ సెల్ఫిష్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదేంటి అద్భుతమైన సెంచరీతో కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకుంటే.. మీరు స్వార్థపరుడు అంటున్నారు? అని కొందరికి కోపం కూడా రావొచ్చు. అందులో ఎలాంటి తప్పులేదు. జడ్డూ భాయ్ ను సెల్ఫిష్ అనడానికి కారణం మనకు తెలియనిది కాదు. రాంగ్ కాల్ కు పిలిచి అనవసరంగా సర్ఫరాజ్ ను రనౌట్ చేశాడని నెటిజన్లు జడేజాపై కాస్త గుర్రుగానే ఉన్నారు. తాజాగా ఈ రనౌట్ పై సర్ఫరాజ్ కు క్షమాపణలు చెబుతూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు జడేజా.

డెబ్యూ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అవ్వడంతో.. దానికి కారణం రవీంద్ర జడేజానే అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో జడేజా సెల్ఫిష్ అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం రనౌట్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు జడ్డూ. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో సర్ఫరాజ్ ఖాన్ కు క్షమాపనలు చెబుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. అందులో..”ప్రస్తుతం నేను బాధకు గురౌతున్నాను. సర్ఫరాజ్ ను రన్ కు రమ్మని రాంగ్ కాల్ చేశాను. అతడు ఈ రోజు అద్భుతంగా ఆడాడు” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు జడ్డూ.

మరోవైపు మ్యాచ్ అనంతరం మాట్లాడిన సర్ఫరాజ్ జడేజాని ప్రశంసించాడు. అతడి కారణంగానే నేను హాఫ్ సెంచరీ చేశానని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది భారత జట్టు. కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110*), సర్ఫరాజ్ ఖాన్(62) పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మరి తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పిన రవీంద్ర జడేజాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Sarfaraz Khan: రోహిత్‌ మాస్టర్‌ ప్లాన్‌తో సర్ఫరాజ్‌ సూపర్‌ సక్సెస్‌! ఆ ఒక్క ఐడియాతో..