SNP
Ravichandran Ashwin, RR vs PBKS, IPL 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్‌ను విధ్వంసకర రీతిలో చాటిచెప్పాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Ravichandran Ashwin, RR vs PBKS, IPL 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్‌ను విధ్వంసకర రీతిలో చాటిచెప్పాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్‌లో అంతా కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బ్యాటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా అదరగొడుతున్న నరైన్.. కేకేఆర్ ఓపెనర్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మరో నరైన్‌లా మరిపోయాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. బుధవారం గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మెరుపులు మెరిపించాడు. హేమాహేమీ బ్యాటర్లు విఫలమైన చోట అశ్విన్ సూపర్ షాట్లతో రెచ్చిపోయాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్ మంచి మంచి షాట్లతో తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 రన్స్ చేశాడు. ముఖ్యంగా రాహుల్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో అయితే.. విధ్వంసం సృష్టించాడు. వరుస బంతుల్లో ఏకంగా 6, 4, 4తో ఒక నిఖార్సయిన బ్యాటర్ ఆడినట్లు షాట్లు ఆడాడు. అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే.. భారీ స్కోర్ చేసేలా కనిపించాడు. కానీ, అర్షదీప్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బాల్‌కు శశాంక్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగుల స్వల్ప స్కోర్ చేసింది. రియాన్ పరాగ్ 34 బంతుల్లో 48 పరుగులు చేసి రాణించాడు. అశ్విన్ 19 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో ఆర్‌ఆర్ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక 145 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. సామ్ కరన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లతో రాణించినా.. తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
If Sunil Narine can perform with bat then Ravi Ashwin can do much better than him.
Ashwin started to pick before the T20 World Cup, Soon one of the player will get back back spasm to make a place for him.
Death, tax and Ashwin in WC is inevitable.pic.twitter.com/n6eSIYkQp3
— Sujeet Suman (@sujeetsuman1991) May 15, 2024