iDreamPost

Ravichandran Ashwin: నా కోరిక అదే.. అనుకోకుండా ఇలా అయ్యాను! అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

500 వికెట్ల క్లబ్ లో చేరిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కోరిక అదేనని, కానీ అనుకోకుండా ఇలా అయ్యానని చెప్పుకొచ్చాడు. మరి ఈ స్టార్ స్పిన్నర్ డ్రీమ్ ఏంటో చూద్దాం.

500 వికెట్ల క్లబ్ లో చేరిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కోరిక అదేనని, కానీ అనుకోకుండా ఇలా అయ్యానని చెప్పుకొచ్చాడు. మరి ఈ స్టార్ స్పిన్నర్ డ్రీమ్ ఏంటో చూద్దాం.

Ravichandran Ashwin: నా కోరిక అదే.. అనుకోకుండా ఇలా అయ్యాను! అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అరుదైన ఘనత సాధించాడు. తన టెస్ట్ కెరీర్ లో 500 వికెట్లు సాధించి.. చరిత్ర సృష్టించాడు. ఇక ఈ రికార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పి.. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా నాన్నకు నేను ఇస్తున్న చిరు కానుక ఇది అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్. ఈ క్రమంలోనే మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ వెటరన్ స్పిన్నర్.

రవిచంద్రన్ అశ్విన్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ఓ దిగ్గజ బౌలర్ గా కీర్తి అందుకుంటూ ఉన్నాడు. తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థులను బోల్తాకొట్టించడమే కాకుండా.. బ్యాటింగ్ లో సత్తాచాటగల నిఖార్సైన ఆల్ రౌండర్ అశ్విన్. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో సైతం బాగానే రాణిస్తున్నాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ వికెట్ దక్కించుకోవడం ద్వారా 500 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నిలిచాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

“నేను సాధించిన ఈ 500వ వికెట్ రికార్డును మా నాన్నకి డెడికేట్ చేస్తున్నా. నేను ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. యాక్చువల్లీ నేను స్పిన్నర్ అవ్వాలనుకోలేదు. యాక్సిడెంటల్ గా అయ్యాను. నేనెప్పుడూ బ్యాటర్ కావాలనే కలలు కనేవాడిని. కానీ నా లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటన కారణంగా నేను స్పిన్నర్ గా మారాల్సి వచ్చింది. లేకుంటే బ్యాటరే అయ్యేవాడిని” అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కాగా.. అశ్విన్ చిన్నతంలో కంటికి గాయం అవ్వడంతో.. కంటి చూపును కొంత కోల్పోయాడు. దీంతో బ్యాటింగ్ కష్టంగా ఉండేది. కోచ్ సలహాతో స్పిన్నర్ గా మారాడు. అప్పటి నుంచి తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థికి వణుకుపుట్టిస్తూనే ఉన్నాడు. మరి బ్యాటర్ అవ్వాలనుకుని యాక్సిడెంటల్ గా బౌలర్ అయిన అశ్విన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Dejana Radanovic: ఇండియాపై నోరుపారేసుకున్న టెన్నిస్ స్టార్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి