iDreamPost

Ravichandran Ashwin: రిటైర్మెంట్​పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ క్షణమే ఆటను వదిలేస్తానంటూ..!

  • Author singhj Published - 09:20 PM, Sat - 2 December 23

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ క్షణమే తాను గేమ్​ను వదిలేస్తానని అన్నాడు.

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ క్షణమే తాను గేమ్​ను వదిలేస్తానని అన్నాడు.

  • Author singhj Published - 09:20 PM, Sat - 2 December 23
Ravichandran Ashwin: రిటైర్మెంట్​పై అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ క్షణమే ఆటను వదిలేస్తానంటూ..!

సౌతాఫ్రికా టూర్​కు వెళ్లే భారత టీమ్స్​ను ప్రకటించింది బీసీసీఐ. ఇందులో మూడు జట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ప్రకటించింది. టెస్టులకు రోహిత్ శర్మ, వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్​ను సారథులుగా నియమించింది బోర్డు. ఈ సిరీస్​కు సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా సెలక్ట్ అయ్యాడు. టెస్ట్ టీమ్​లో ఆడనున్నాడీ ఆఫ్​ స్పిన్నర్. లిమిటెడ్ ఓవర్ సిరీస్​లకు కాకుండా కేవలం టెస్టులకు మాత్రమే అతడ్ని ఎంపిక చేసింది బీసీసీఐ. రీసెంట్​గా ముగిసిన వన్డే వరల్డ్ కప్-2023 స్క్వాడ్​లో ఉన్నప్పటికీ కేవలం ఒకే మ్యాచ్​లో ఆడాడు అశ్విన్. అయితే అతడు మెగా టోర్నీకి సెలక్ట్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. గత నాలుగైదేళ్ల నుంచి లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లో ప్లేస్ కోసం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే స్వదేశంలో ప్రపంచ కప్ జరుగుతుండటంతో ఇక్కడి పరిస్థితులు అశ్విన్​కు బాగా తెలుసు.. బ్యాటంగ్ కూడా చేయగలడనే ఉద్దేశంతో అతడ్ని మెగా టోర్నీలో ఆడించింది బీసీసీఐ.

టెస్టుల్లో తప్ప ఇతర ఫార్మాట్స్​లో రెగ్యులర్​గా ఆడే అవకాశం రాకున్నా తన ఫిట్​నెస్​ను కాపాడుకుంటున్నాడు అశ్విన్. బౌలింగ్​లో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. మెంటల్​గా మరింత ఫిట్​గా మారేందుకు ఎక్స్​పర్ట్స్ సాయం కూడా తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని భారత మాజీ ప్లేయర్ ఎస్​ బద్రీనాథ్​తో చిట్​చాట్​లో అశ్విన్ వెల్లడించాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే తాను కూడా ఇబ్బంది పడతానని అన్నాడు. నాలుగైదేళ్లుగా కెరీర్​లో బ్యాడ్ డేస్ చూశానన్నాడు. మానసికంగా మరింత బలంగా మారేందుకు ఎక్స్​పర్ట్స్​తో పాటు ఇతరుల సాయం తీసుకున్నానని తెలిపాడు అశ్విన్. అయితే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా తట్టుకునేందుకు రెడీగా ఉండాలని భావించానని చెప్పాడు. ఇప్పడు తాను చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నానన్నాడు.

క్రికెటర్​గా వచ్చే ఐదేళ్లు ఎలా ఉండాలనే దాని మీద ఎప్పటికప్పుడు నేను రెడీ అవుతా. అందుకోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటా. ఒక టైమ్​లో బ్యాటింగ్​లో నా భాగస్వామ్యం అవసరమని భావించా. అందుకే అమెరికా వెళ్లి బేస్​బాల్​తోనూ ప్రాక్టీస్ చేశా. ఏ రోజైతే మార్నింగ్ లేచి బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేయడం చికాకుగా అనిపిస్తుందో.. ఇంకేం ఆడతామనే భావన కలుగుతుందో.. ఆడే ఇంట్రెస్ట్ ఉండదో ఆ క్షణమే క్రికెట్​ నుంచి రిటైర్ అవుతా. అప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పేసి లైఫ్​లో కొత్త ఛాప్టర్​ స్టార్ట్ చేస్తా’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్​ ఫైనల్లో తనను ఆడించకపోవడం మీదా స్టార్ స్పిన్నర్ క్లారిటీ ఇచ్చాడు. ఫైనల్లో ఆడనందుకు ఆందోళన చెందానని.. కానీ ఏ కెప్టెన్​కైనా టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యమన్నాడు అశ్విన్. అయితే ఇలాంటి మ్యాచుల్లో ఆడే ఛాన్స్ వస్తే మాత్రం రెడీగా ఉంటానని పేర్కొన్నాడు. మరి.. రిటైర్మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rinku Singh: భారీ సిక్సుల వెనుక సీక్రెట్ ఏంటో చెప్పేసిన రింకూ సింగ్.. దాని వల్లే అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి