iDreamPost

Rinku Singh: భారీ సిక్సుల వెనుక సీక్రెట్ ఏంటో చెప్పేసిన రింకూ సింగ్.. దాని వల్లే అంటూ..!

  • Author singhj Published - 08:18 PM, Sat - 2 December 23

భారత నయా ఫినిషర్ రింకూ సింగ్ నీళ్లు తాగినంత ఈజీగా భారీ సిక్సులు బాదేస్తున్నాడు. అతడి కొట్టుడుకు బౌలర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

భారత నయా ఫినిషర్ రింకూ సింగ్ నీళ్లు తాగినంత ఈజీగా భారీ సిక్సులు బాదేస్తున్నాడు. అతడి కొట్టుడుకు బౌలర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

  • Author singhj Published - 08:18 PM, Sat - 2 December 23
Rinku Singh: భారీ సిక్సుల వెనుక సీక్రెట్ ఏంటో చెప్పేసిన రింకూ సింగ్.. దాని వల్లే అంటూ..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్​ను భారత్ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్​ను కైవసం చేసుకుంది. ఆసీస్​తో శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 20 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన మన జట్టు నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 174 రన్స్ చేసింది. రింకూ సింగ్ (46), యశస్వి జైస్వాల్ (37), జితేష్ శర్మ (35) రాణించారు. ఒక దశలో వికెట్లేమీ కోల్పోకుండా 5 ఓవర్లకు 50 రన్స్​తో ఉన్న భారత్.. ఈజీగా 200 చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత వెంట వెంటనే జైస్వాల్​తో పాటు శ్రేయస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లను కోల్పోయింది. దీంతో కష్టాల్లో పడ్డ టీమ్​ను రుతురాజ్ గైక్వాడ్ (32) ఆదుకున్నాడు. రింకూతో కలసి ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడు.

రుతురాజ్ పెవిలియన్​కు చేరుకున్నా జితేష్, రింకూలు ధనాధన్ బ్యాటింగ్​తో టీమ్​ 174 రన్స్ చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షూస్ 3 వికెట్లు తీయగా.. జేసన్ బెరెన్​డార్ఫ్​, తన్వీర్ సంఘా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్​కు దిగిన అపోజిషన్​ టీమ్​ను భారత బౌలర్లు సూపర్బ్​గా కట్టడి చేశారు. మొదట్లో ట్రావిస్ హెడ్ (31), ఆఖర్లో మ్యాథ్యూ వేడ్ (36) భయపెట్టినా మిగిలిన ఇన్నింగ్స్ మొత్తం మన బౌలర్లదే డామినేషన్ నడిచింది. ఆసీస్ బ్యాటర్లు క్రీజులో కుదురుకునే లోపే వాళ్లను పెవిలియన్​కు పంపారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 రన్స్ మాత్రమే చేయగలిగింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్ (3/16), రవి బిష్ణోయ్ (1/17) అద్భుతంగా బౌలింగ్ చేశారు. రన్స్​ ఇవ్వకుండా వికెట్లు తీస్తూ కంగారూలను పరేషాన్ చేశారు. దీపక్ చాహర్ కూడా 2 వికెట్లతో ఆసీస్ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఆసీస్​తో టీ20 సిరీస్​లో భారత్​ టీమ్​కు ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్​కు మరో 7 నెలల టైమ్ మాత్రమే మిగిలి ఉండటంతో టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలని అనుకుంటోంది టీమిండియా. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ, రింకూ సింగ్, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్ లాంటి యంగ్​స్టర్స్ అద్భుతంగా ఆడుతుండటం మనకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ఫినిషర్ రోల్​ కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు రింకూ రూపంలో భారీ పించ్ హిట్టర్ దొరికాడు. అవసరమైనప్పుడు ఫోర్లు, సిక్సులు కొడుతూనే.. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ కూడా రొటేట్ చేస్తున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్.

ఆఖర్లో వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతున్న రింకూను అందరూ మహేంద్ర సింగ్ ధోనీతో పోలుస్తున్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్​గా నిలబడి మ్యాచ్​లు ఫినిష్ చేస్తున్న రింకూను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అలాంటి అతడు అలవోకగా భారీ షాట్లు కొట్టడం వెనుక ఉన్న సీక్రెట్​ను రివీల్ చేశాడు. రోజూ ఎక్సర్​సైజ్ చేయడం, మంచి ఫుడ్​ తీసుకోవడమే తన బలానికి కారణమన్నాడు. సహచర క్రికెటర్ జితేష్ శర్మతో కలసి జిమ్​లో వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ వర్కవుట్లు చేస్తానన్నాడు. ఇది షాట్లు కొట్టేటప్పుడు పవర్​ను జనరేట్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతోందన్నాడు. తనలోని నేచురల్ పవర్ కూడా భారీ సిక్సర్లు బాదేందుకు హెల్ప్ అవుతోందని చెప్పుకొచ్చాడు రింకూ. మరి.. రింకూ నెక్స్ట్ ధోని అంటూ వస్తున్న వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rahul Dravid: వరల్డ్‌ కప్‌ ఓటమి తర్వాత తొలిసారి బయటికొచ్చిన ద్రవిడ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి