iDreamPost

తిలక్‌ వర్మను రోహిత్‌తో పోల్చిన స్టార్‌ క్రికెటర్‌! ఇద్దరిలో సేమ్‌ క్వాలిటీ ఇదేనంటూ..

  • Published Aug 08, 2023 | 12:36 PMUpdated Aug 08, 2023 | 12:36 PM
  • Published Aug 08, 2023 | 12:36 PMUpdated Aug 08, 2023 | 12:36 PM
తిలక్‌ వర్మను రోహిత్‌తో పోల్చిన స్టార్‌ క్రికెటర్‌! ఇద్దరిలో సేమ్‌ క్వాలిటీ ఇదేనంటూ..

ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో మారుమోగిపోతున్న పేరు తిలక్‌ వర్మ. ఈ తెలుగు తేజం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ క్రికెట్‌ టౌన్‌. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వారంలో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున 2022, 23 సీజన్లలో అద్భుతంగా ఆడి గుర్తింపు పొందిన ఈ యువ క్రికెటర్‌.. వెస్టిండీస్‌తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 39 పరుగులతో జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే రెండో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

టీమిండియా తరపున టీ20ల్లో హాఫ్‌ సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైనప్పటికీ తిలక్‌ వర్మ ప్రదర్శనపై మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. జట్టును ఆదుకుని వెన్నుముకలా నిలిచాడని, ఎంతో పరిణతి చెందిన బ్యాటర్‌లా ఆడాడని మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులు, క్రికెట్‌ నిపుణులు సైతం తిలక్‌ను భవిష్యత్తు టీమిండియా స్టార్‌గా కొనియాడారు. ముఖ్యంగా అతని ఫీయర్‌లెస్‌ బ్యాటింగ్‌ స్టైల్‌పై చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఒక నిఖార్సయిన టీ20 యువ క్రికెటర్‌లో ఉండాల్సిన ఇంటెంట్‌ ఇదేనంటూ మెచ్చకున్నారు.

అయితే టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అయితే తిలక్‌ వర్మను ఏకంగా రోహిత్‌ శర్మతో పోల్చాడు. టీమిండియా యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ కెరీర్‌ ఆరంభంలోనే అందరిని ఆకట్టుకుంటున్నాడని, స్లో పిచ్‌పై కూడా అతను ఇంపీరియస్ టచ్‌లో ఆడుతున్నాడని కొనియాడాడు. అలాగే అతని ఆట చాలా వరకు రోహిత్ శర్మను పోలి ఉందని అన్నాడు. దీంతో తిలక్‌ వర్మ అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ రోహిత్‌ కెప్టెన్సీలోనే గుర్తింపు పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే తిలక్‌కు రోహిత్‌ గురువు లెక్క. అలాంటి ఆటగాడు ఇప్పుడు గురువులానే ఆడుతున్నాడని మరో దిగ్గజ క్రికెటర్‌ మెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయమే. మరి అశ్విన్‌.. తిలక్‌ను రోహిత్‌తో పోల్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్‌ బౌలర్లపై రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు! పెద్ద కాంట్రవర్సీ అవుతుందంటూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి