iDreamPost

Mr Bachchan: వాలెంటైన్స్ డే స్పెషల్.. రవితేజ ‘బచ్చన్’ నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్!

  • Published Feb 14, 2024 | 2:18 PMUpdated Feb 14, 2024 | 2:18 PM

సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు మాస్ మహారాజా రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్​ను లైన్​లో పడుతున్నారు.

సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు మాస్ మహారాజా రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్​ను లైన్​లో పడుతున్నారు.

  • Published Feb 14, 2024 | 2:18 PMUpdated Feb 14, 2024 | 2:18 PM
Mr Bachchan: వాలెంటైన్స్ డే స్పెషల్.. రవితేజ ‘బచ్చన్’ నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్!

క్వాలిటీ కంటెంట్ పేరుతో ఒక్కో చిత్రానికి ఏడాది, రెండేళ్లు టైమ్ తీసుకుంటున్న రోజులివి. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని బయటకు రావడానికి కొన్ని సినిమాలకైతే రెండు, మూడేళ్ల టైమ్ కూడా పడుతోంది. బడా హీరోల మూవీస్ అన్నింటిదీ దాదాపుగా ఇదే పరిస్థితి. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం తన రూటే సెపరేటు అంటున్నారు. సినిమా మీద సినిమా చేసుకుంటూ జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారాయన. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్​ను లైన్​లో పెడుతున్నారు. ఒక సినిమా రిలీజై మూడ్నాలుగు నెలలు కాకముందే మరో ప్రాజెక్ట్​ను రెడీ చేసేస్తున్నారు రవితేజ. ఇటీవలే ‘ఈగల్’తో ఆడియెన్స్​ను పలకిరించిన ఆయన.. ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్​’ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ఫిల్మ్ నుంచి రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రముఖ దర్శకుడు హరీష్​ శంకర్ డైరెక్షన్​లో రూపొందుతున్న ‘మిస్టర్ బచ్చన్’ నుంచి వచ్చిన రొమాంటిక్ పోస్టర్ నెట్టింట హల్​చల్​ చేస్తోంది. రవితేజ ఒడిలో హీరోయిన్ ప్రేమగా కూర్చోగా ఆయన ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నట్లు ఉన్న ఈ పోస్టర్ అదిరిపోయింది. డార్క్ గ్రీన్ కలర్ శారీలో హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే తన స్మైల్​తో చంపేస్తోంది. మాస్ మహారాజా కలర్​ఫుల్ షర్ట్​లో ఆమెను హగ్ చేసుకొని క్లాసీ లుక్​లో కనిపించారు. ఈ పోస్టర్​లో ఉన్న వీళ్ల కెమిస్ట్రీ స్క్రీన్ మీద కూడా వర్కవుట్ అయితే రవితేజ అకౌంట్​లో మరో హిట్ పడినట్లే. ఈ పోస్టర్​పై ఆయన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని.. లవ్ ట్రాక్ సూపర్బ్​గా ఉందని అంటున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్​టైనర్​తో తమ హీరో హిట్ కొట్టడం ఖాయమని మాస్ మహారాజా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ ఫిల్మ్​కు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అవినాష్​ కొల్లా డిజైనర్​గా వ్యవహరిస్తుండగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. బాలీవుడ్​లో సూపర్​హిట్​గా నిలిచిన అజయ్ దేవగణ్ ‘రైడ్​’ చిత్రానికి రీమేక్​గా ‘మిస్టర్ బచ్చన్’ రూపొందుతోంది. ‘ఈగల్’తో మంచి హిట్ కొట్టిన జోష్​లో ఉన్న రవితేజ.. హరీష్ శంకర్ ఫిల్మ్​తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం మాస్ మహారాజా చాలా కష్టపడుతున్నారని.. 24 గంటలు పని చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ అంటూ ఇటీవలే హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాజాగా రిలీజైన పోస్టర్​ వైరల్ అవడం, మంచి రీచ్ రావడంతో ‘మిస్టర్ బచ్చన్’పై ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగాయి. మరి.. ‘మిస్టర్ బచ్చన్’ రొమాంటిక్ పోస్టర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Varsha Bollamma: ఆ క్రికెటర్ అంటే నాకు పిచ్చి.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి