iDreamPost

ఆదిరెడ్డిపై రతిక సోదరి సంచలన కామెంట్స్! ఏమైందంటే?

టెలివిజన్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీవీలు చూడని వారు సైతం.. ఈ షో కోసం చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా 70 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. టాస్కులు, స్కిట్లతో రెచ్చిపోతున్నారు కంటెస్టెంట్లు. అయితే వీరిలో రతికా రోజ్..

టెలివిజన్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీవీలు చూడని వారు సైతం.. ఈ షో కోసం చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా 70 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. టాస్కులు, స్కిట్లతో రెచ్చిపోతున్నారు కంటెస్టెంట్లు. అయితే వీరిలో రతికా రోజ్..

ఆదిరెడ్డిపై రతిక సోదరి సంచలన కామెంట్స్! ఏమైందంటే?

బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ.. ఎక్కువ రేటింగ్ తో దూసుకెళ్లిపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకుని, ఏడవ సీజన్లలోకి అడుగుపెట్టింది. ఉల్టా పల్టా అంటూ కొత్త కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది టీమ్. షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపిన బిగ్ బాస్ 5 సభ్యులను ఎలిమినేట్ చేశాడు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగుర్ని ఇంట్లో పంపించారు. అలాగే ఎలిమినేట్ అయిన వాళ్లలో నుండి రతిక తిరిగి హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. టాస్కులు, స్కిట్లు, గేమ్స్‌తో ఫన్నీగా సాగిపోతుంది. వీకెండ్స్, నామినేషన్ల సమయంలో ఎక్కువ మంది టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇప్పటి వరకు 70 రోజులకు పైగా ఇంట్లో గడిపేశారు కంటెస్టెంట్లు.

అయితే ఈ సారి హౌస్‌లో బాగా ఆడుతుంది అని ఎక్స్ పర్ట్ చేసి.. నెగిటివిటీని మూట కట్టుకున్న కంటెస్టెంట్ ఎవరంటే.. రతికా రోజ్. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఈ అమ్మాయి కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని ఊహించారంతా.. కానీ ఆ తర్వాత ఆమె.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజీ ఇతర కంటెస్టెంటులతో ప్రవర్తించిన తీరుతో ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే ఆమె ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే బెటర్ అని ఫీలయ్యారు. అలానే ఎలిమినేట్ చేశారు. ఇంట్లో ఉండగానే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె దిగిన పిక్స్ లీకయ్యాయి. ఆ లీక్స్ పై రాహుల్ కూడా ఫైర్ అయ్యారు. దీనిపై వివరణ ఇచ్చింది రతిక సోదరి.

వాళ్లిద్దరి మధ్య అసలు ఏం జరిగింది.. పెళ్లి వరకు వెళ్లిన వీరి లవ్ స్టోరీ..ఎలా బ్రేకప్ అయ్యిందో చెప్పింది. తిరిగి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యింది రతిక. తన అక్క బాగా ఆడుతుందని పేర్కొంది. అయితే ఆమెపై ట్రోల్స్ ఆగడం లేదు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్, యూట్యూబర్ ఆది రెడ్డిపై విరుచుకు పడింది రతిక సోదరి. తనను నెగిటివ్ చేస్తూ.. వీడియోలు రూపొందించడంపై మండిపడింది. తను ఎందుకు అలా చేస్తున్నాడని అర్థం కావడం లేదన్నారు రతిక సోదరి. ఆది అంతక ముందు సీజన్‌లో బిగ్ బాస్ ఇంట్లో ఎక్స్ పీరియన్స్ అయ్యి వచ్చాడని, అన్నీ ఆయనకు తెలుసునని పేర్కొంది.  తన వ్యూస్ పెంచుకోవడం కోసం మా అక్క గురించి బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారని, తాను రతిక అలా వినియోగించుకుంటున్నాడని కామెంట్స్ చేసింది.

ఆది వల్ల, అతడు చేసిన వీడియోల వల్ల మేము, మా ఫ్యామిలీ చాలా హార్ట్ అయ్యామని, అది ఆయనకు తెలియాలని పేర్కొంది. తనకు కూడా ఫ్యామిలీ కూడా ఉంది కదా. గతంలో ఆది రెడ్డి హౌస్ లో ఉన్నప్పుడు నెగిటివిటీని ఎదుర్కొని ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ పరిస్థితులు ఆయనకు కుణ్ణంగా తెలుసు.  కానీ రతిక మీదే ఎందుకు నెగిటివిటీ చేస్తున్నారో తెలియడం లేదు. సింగర్ భోళే విషయంలో శోభా శెట్టి, ప్రియాంక ఇద్దరు అరిచారని, వారిపై ఎందుకు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం లేదని ప్రశ్నించింది. ట్రోల్ చేసేంత పెద్ద తప్పు రతిక ఏం చేసిందంటూ మండిపడింది సోదరి. ఆదిరెడ్డి రతికను టార్గెట్ చేస్తూ.. వీడియోలు చేస్తున్నాడని రతికా సోదరి కామెంట్లపై మీరేమంటారో అభిప్రాయాన్ని తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి