iDreamPost
android-app
ios-app

Rathika Rose: శివాజీ కాళ్లు మొక్కడం వెనుక రతిక మాస్టర్ ప్లాన్!

  • Published Oct 23, 2023 | 5:13 PM Updated Updated Oct 23, 2023 | 5:13 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొత్తాన్ని ఉల్టా పుల్టాగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఎందుకంటే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినవాళ్లు మళ్లీ మళ్లీ తిరిగి హౌస్ లోకి రావడం చూస్తుంటే అసలు ఎలిమినేషన్ దేనికి అనే ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. అయితే రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొత్తాన్ని ఉల్టా పుల్టాగానే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. ఎందుకంటే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినవాళ్లు మళ్లీ మళ్లీ తిరిగి హౌస్ లోకి రావడం చూస్తుంటే అసలు ఎలిమినేషన్ దేనికి అనే ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. అయితే రతికా రోజ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.

  • Published Oct 23, 2023 | 5:13 PMUpdated Oct 23, 2023 | 5:13 PM
Rathika Rose: శివాజీ కాళ్లు మొక్కడం వెనుక రతిక మాస్టర్ ప్లాన్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అంతా ఉల్టా పుల్డాగానే జరుగుతోంది. ముగ్గురు ఎవిక్టీలను తీసుకొచ్చి ఒకరిని హౌస్ లోకి పంపిస్తామన్నారు. అందుకు హౌస్ మేట్స్ ఓట్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. సరే అని అందరూ ఓట్లు వేశారు. తీరా ఓట్లేశాక ఎవరికైతే లీస్ట్ ఓట్లు పడతాయో వారినే హౌస్ లోకి తీసుకొస్తాం అన్నారు. అన్నట్లుగానే రతికా రోజ్ ని తీసుకొచ్చారు. హౌస్ మేట్స్ నుంచి ఆమెకు తక్కువ ఓట్లు పడతాయని అందరికీ తెలిసిన విషయమే. అందుకే అలాంటి ఒక రూల్ పెట్టి.. వాళ్లు అనుకున్నట్లుగానే రతికా రోజ్ ని హౌస్ లోకి తీసుకెళ్లారు. హౌస్ లోకి అడుగుపెట్టిన రతికా రోజ్ పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్లు కనిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రతికా రోజ్ అందరికీ కొత్తగా కనిపిస్తోంది. హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు.. ప్రక్షకుల్లో కూడా ఆ ఫీలింగ్ కనిపిస్తోంది. అయితే హౌస్ లో ఫుల్ నెగిటివిటీతో బయటకు వెళ్లింది కాబట్టి ఇలా చేస్తోంది అని అంతా అనుకోవచ్చు. అయితే అంతకు మించి పెద్ద ప్లాన్ తోనే రతికా రోజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హౌస్ లో నుంచి వెళ్తూ కనీసం శివాజీ, ప్రశాంత్ ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీతో నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మాట్లాడితే ఏడుపొస్తుంది. నేను ఏడవకూడదు అనుకున్నాను అందుకే మీతో మాట్లాడలేదు అని చెప్పింది. అంతేకాకుండా శివాజీని రూమ్ లోకి తీసుకెళ్లి ఎవరన్నా చూస్తున్నారా అని చూసుకుని కాళ్లు కూడా మొక్కేసింది.

శివాజీకి  రతికా రోజ్ క్షమాపణ కూడా చెప్పింది. అందుకు శివాజీ లేదమ్మ.. అలా చేయకు అంటూ వారించాడు. తర్వాత ప్రశాంత్ తో కూడా మంచిగా మాట్లాడింది. అక్క అంటుంటే.. అలా కాదు అన్నట్లు సైగ చేసి.. రతికా అని పిలవమని చెప్పింది. ఇదంతా చూసిన తర్వాత మొదట అందరికీ వచ్చే ఆలోచన రతికా రోజ్ మారిపోయింది అని. ఇక్కడ ఇంకో ఆలోచన కూడా రావాలి. అదంతా రతికా రోజ్ గేమ్ ప్లాన్ అని చెప్పాలి. ఎందుకంటే హౌస్ బయట శివాజీకీ, పల్లవి ప్రశాంత్ కి ఎంత క్రేజ్ ఉందో రతికా రోజ్ కళ్లారా చూసింది. సోషల్ మీడియాలో వారి ఫాలోయింగ్ ఏంటో తెలుసుకుంది. అందుకే హౌస్ లోకి అడుగుపెట్టగానే శివాజీ కాళ్ల మీద పడిపోయింది.

ప్రశాంత్ తో కూడా తిరిగి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అని చూస్తోంది. హౌస్ లో ఉన్న వాళ్లు ఎవరు ఏం అడిగినా కూడా సమాధానం చెప్పని రతికా రోజ్.. శివాజీ మాత్రం ఏం అడిగినా టక్కున సమాధానం చెబుతోంది. హైదరాబాద్ లో ఉన్నావా? ఇంటికి వెళ్లావా? అనే ప్రశ్నకు కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు. శివాజీ అడిగితే మాత్రం అన్ని ప్రశ్నలకు టకా టకా సమాధానం చెప్తోంది. ఇంక పల్లవి ప్రశాంత్ మాత్రం తన దారి తనది అన్నట్లు కాస్త దూరంగానే ఉంటున్నాడు. ఇప్పటికే పెద్ద రచ్చే అయ్యింది.. ఇంక మళ్లీ మనకి ఎందుకు అనుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. అందుకే రతికా రోజ్ కు కాస్త డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నట్లుగానే ఉన్నాడు. మరి.. రతికా రోజ్– శివాజీ కాళ్లు మొక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibom