iDreamPost

9 వారాలకు రతిక రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

రతికా రోజ్ కు వైల్డ్ కార్డు రూపంలో రెండో అవకాశం దక్కింది. కానీ, ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ సీజన్ లో మొత్తం 9 వారాలు హౌస్ లో కొనసాగింది. ఈ 9 వారాలకు తనకు ఎంత రెమ్యూనరేషన్ దక్కిందంటే?

రతికా రోజ్ కు వైల్డ్ కార్డు రూపంలో రెండో అవకాశం దక్కింది. కానీ, ఆ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ సీజన్ లో మొత్తం 9 వారాలు హౌస్ లో కొనసాగింది. ఈ 9 వారాలకు తనకు ఎంత రెమ్యూనరేషన్ దక్కిందంటే?

9 వారాలకు రతిక రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో 12 వారాలు పూర్తయ్యాయి. 11వ వారం నో ఎలిమినేషన్ వీక్ గా ప్రకటించడంతో.. 12వ వారం డబుల్ ఎలిమినేషన్ చేశారు. శనివారం హౌస్ నుంచి అశ్వినీ ఎలిమినేట్ అయ్యి బయటకు రాగా.. ఆదివారం రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యింది. ఈసారి మాత్రం ఎలిమినేట్ అయ్యినందుకు రతికా రోజ్ పెద్దగా బాధ పడినట్లు కనిపించలేదు. చాలా స్పోర్టివ్ గా తీసుకుంది. ఎందుకంటే ప్రతిసారి వచ్చే వారం బాగా ఆడతాను అనే మాట చెప్పడం తనకి కూడా నచ్చినట్లు లేదు. అందుకే ఇంక ఎలిమినేషన్ ని యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేసింది.

రతికా రోజ్ ఫస్ట్ నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత 7వ వారం వైల్డ్ కార్డ్ రూపంలో హౌస్ లోకి వచ్చింది. మళ్లీ 12వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిజానికి రతికా రోజ్ ఎన్నో హోప్స్ పెట్టుకుని బిగ్ బాస్ సీజన్ కి వెళ్లింది. కెరీర్ లో ఎంత కష్టపడినా అవకాశం దక్కడం లేదని భావించి.. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలని భావించింది. కానీ, తాను అనుకున్నది ఒకటైతే.. అక్కడ జరిగింది మరొకటి. బిగ్ బాస్ వల్ల ఆమెకు ఎక్కడలేని నెగిటివిటీ వచ్చింది. రెండోసారి అవకాశం వచ్చినప్పుడు ఆ నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేసింది. కానీ, దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసి ఆటను లైట్ తీసుకుంది. ఏ టాస్కుని కూడా 100 పర్సంట్ ఆడలేకపోయింది.

ముఖ్యంగా శివాజీ, ప్రశాంత్, యావర్ తోనే టైమ్ స్పెండ్ చేసింది. మిగిలిన వారితో పెద్దగా కలిసింది లేదు. శివాజీ చెప్పే వరకు నామినేషన్స్ లో కూడా గట్టిగా మాట్లాడలేదు. శివాజీ చెప్పాడు అని అర్థం లేకుండా నామినేషన్స్ లో గొడవలకు దిగింది. హౌస్ లో ముఖ్యంగా ఎలాంటి ఫిజికల్ టాస్కుల్లో కూడా పాల్గొనలేదు. అలాగని ఎంటర్ టైన్మెంట్ విషయంలో కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. రిటన్ అయ్యాక మొదటి రెండు వారాలు సారీలు చెప్పుకోవడానికే సరిపోయింది. మొత్తానికి ఏదైతే తిరిగి వచ్చిన తర్వాత తన ఆటతో అందరినీ అదరగొడతాను అందో అలా అయితే చేయలేదు. ఒకసారి బయటకు వచ్చిన వాళ్లు తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం చాలా అరుదు. అలాంటి ఒక మంచి అవకాశం రతికాకి దక్కింది.

ఆ గోల్డెన్ ఛాన్స్ ని రతికా రోజ్ సరిగ్గా వాడుకోలేదు. అందుకే మరోసారి ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. వస్తూ వస్తూ హౌస్ లో ఉన్న వారికి తనవంతుగా కొన్ని సలహాలు ఇచ్చింది. అందరూ బాగా ఆడాలంటూ సూచించింది. ఎవరి గురించి కూడా అంత బ్యాడ్ గా అయితే చెప్పలేదు. కానీ, బిగ్ బాస్ బజ్ లో మాత్రం ఓపెన్ అయిపోయింది. కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసింది. ఇంక రతికా రోజ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. మొత్తం ఈ సీజన్లో రతిక 9 వారాలు హౌస్ లో ఉంది. ఈ 9 వారాలకు గాను.. ఆమెకు వారానికి రూ.2 లక్షల చొప్పున రూ.18 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రతికాకి మంచి మొత్తమే దక్కింది. మరి.. రతికా రోజ్ ఎలిమినేట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి