iDreamPost
android-app
ios-app

రతిక క్రేజ్.. బిగ్ బాస్ లో అన్ని లక్షలు సంపాదించిందా!

  • Author Soma Sekhar Published - 01:11 PM, Mon - 2 October 23
  • Author Soma Sekhar Published - 01:11 PM, Mon - 2 October 23
రతిక క్రేజ్.. బిగ్ బాస్ లో అన్ని లక్షలు సంపాదించిందా!

బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను గత 6 సీజన్లుగా అలరిస్తోన్న రియాలిటీ షో. తాజాగా ఏడో సీజన్ లో అడుగుపెట్టిన ఈ షో.. అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఉల్టాఫుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ నిజంగానే షోను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఇక వారాలు గడుస్తున్న కొద్ది హౌస్ నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా నాలుగో వారంలో ఎలిమినేట్ అయ్యింది బ్యూటీ రతిక రోజ్. మెుదటి నుంచి టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక రోజ్ ఎలిమినేట్ అవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా గానీ బాగానే సంపాదించిందంట రతిక. మరి నాలుగు వారాలకు రతిక ఎంత మెుత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసుకుందాం.

రతిక రోజ్.. బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా అంతా భావించారు. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ ఫోకస్ తనపై ఉండేలా చూసుకుంది రతిక. కానీ గేమ్స్, టాస్కుల విషయానికి వచ్చేసరికి తేలిపోయింది. ఎందులోనూ విజయం సాధించలేకపోయింది ఈ బ్యూటీ. దీంతో నాలుగో వారం నామినేషన్స్ లో ఉండాల్సి వచ్చింది. ఇక ఈ నామినేషన్స్ లో ఓట్లు తక్కువగా రావడంతో.. హౌస్ నుంచి బయటకి రాక తప్పలేదు. ఇక రతిక ఎలిమినేషన్ అవ్వడం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. పల్లవి ప్రశాంత్, యావర్ లతో నడిపిన ప్రేమ వ్యవహారం ప్రేక్షకులకు నచ్చకపోవడంతో.. ఆమెకు ఓట్లు వెయ్యలేదు. దీంతో రతిక ఎలిమినేషన్ అవ్వకతప్పలేదు. కాగా.. రతిక నాలుగో వారంలోనే ఎలిమినేషన్ అయినప్పటికీ.. బాగానే వెనకేసిందట. రతికకు రెమ్యూనరేషన్ కింద వారానికి రూ. 2 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు వారాలకు కలిపి మెుత్తం రూ. 8 లక్షలు రతిక అందుకున్నట్లు సమాచారం. ఇక టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక రెమ్యూనరేషన్ పరంగా బాగానే సంపాదించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş