iDreamPost

వీడియో: హైదరాబాద్ యాసలో రష్మిక రచ్చ.. భలే మాట్లాడిందిగా..!

  • Author singhj Published - 03:33 PM, Tue - 11 July 23
  • Author singhj Published - 03:33 PM, Tue - 11 July 23
వీడియో: హైదరాబాద్ యాసలో రష్మిక రచ్చ.. భలే మాట్లాడిందిగా..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మికా మందన్నకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. యూత్​లో ఆమె ఒక రేంజ్​లో అభిమానులు ఉన్నారు. తన అల్లరి చేష్టలు, క్యూట్ యాక్టింగ్​తో కోట్లాది మంది అభిమానాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ కస్తూరికి సోషల్ మీడియాలో 38 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మూవీ షూటింగ్స్ నుంచి కాస్త ఖాళీ సమయం దొరికినా రష్మిక తన ఫ్యాన్స్​తో ఆసక్తికర విషయాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ చిత్రం షూటింగ్ గ్యాప్​లో నెటిజన్లతో ఆమె ముచ్చటించారు. వాళ్లు అడిగిన క్వశ్చన్స్​కు సరదాగా సమాధానాలు చెప్పారు.

మీకు ఇష్టమైన ప్లేస్ ఏదని నెటిజన్స్ అడగ్గా.. ‘కర్ణాటకలోని కూర్గ్​లో ఉన్న మా ఇల్లు అంటే ఎంతో ఇష్టం’ అని రష్మిక జవాబిచ్చారు. తనకు మొత్తంగా ఆరు భాషలు వచ్చని ఆమె తెలిపారు. హైదరాబాద్​ యాసలో మాట్లాడమని ఒక నెటిజన్ క్రష్మికను అడిగారు. దానికి ఆమె.. ‘నమస్తే.. ఎట్లా ఉన్నారు? వచ్చేశెయ్. మస్తు ఉంది’ అంటూ క్యూట్​గా తెలుగులో మాట్లాడేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ మాట్లాడి అందర్నీ ఆమె అలరించారు. నటించడం అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఈ ప్రొఫెషన్​ను తాను ఎంతగానో ప్రేమిస్తున్నట్లు రష్మికా మందన్న తెలిపారు.

ఫుడ్ విషయానికొస్తే.. తనకు కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే చాలా ఇష్టమని రష్మిక చెప్పుకొచ్చారు. ఆహారం సంగతిని పక్కనబెడితే.. రష్మిక హైదరాబాద్ యాసలో మాట్లాడటం ఇంట్రెస్టింగ్​గా మారింది. ఫేవరెట్ హైదరాబాద్ ఫ్రెండ్​ ఎలా మాట్లాడతాడో అలా కొన్ని డైలాగ్స్ చెప్పి అందర్నీ అలరించారామె. అయితే ఫేవరెట్ ఫ్రెండ్ అంటే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించే కదా అని నెటిజన్స్ అంటున్నారు. రష్మిక మాటలు అచ్చం విజయ్​ను తలపిస్తున్నాయని కొందరు నెటిజన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’లో యాక్ట్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ రణ్​బీర్ కపూర్ సరసన ‘యానియల్​’లో నటిస్తున్నారు. మరి.. రష్మిక హైదరాబాద్ యాస మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి