iDreamPost

Rashmika Mandanna: గీతాంజలి పాత్రపై స్పందించిన రష్మిక! ఏమన్నదంటే?

  • Author Soma Sekhar Published - 10:46 AM, Sat - 9 December 23

యానిమల్ మూవీలో గీతాంజలి పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇక తన పాత్రపై సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

యానిమల్ మూవీలో గీతాంజలి పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇక తన పాత్రపై సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Author Soma Sekhar Published - 10:46 AM, Sat - 9 December 23
Rashmika Mandanna: గీతాంజలి పాత్రపై స్పందించిన రష్మిక! ఏమన్నదంటే?

‘యానిమల్’ ప్రస్తుతం ఇండియా వైడ్ గా మారుమ్రోగుతున్నపేరు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాలు జోడీగా నటించారు. విడుదలై వారం రోజులు దాటుతున్నా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది యానిమల్. వారం రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు నెలకొల్పింది. ఇక ఈ మూవీలో రష్మిక గీతాంజలి పాత్రలో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. రణ్ బీర్ తో ఘాటు రొమాన్స్ సీన్స్ తో పాటుగా ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టింది నేషనల్ క్రష్. దీంతో రష్మిక నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు విమర్శకులు. ఇక గీతాంజలి పాత్రపై స్పందించింది రష్మిక. ఆమె ఎలాంటి అమ్మాయో చెప్పుకొచ్చింది.

రష్మిక మందన్నా.. లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ మూవీలో గీతాంజలి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ.. దూసుకెళ్తోంది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక, బాబీ డియోల్, అనీల్ కపూర్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ మూవీలో గీతాంజలి పాత్రలో ఒదిగిపోయింది రష్మిక. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలోనే తన పాత్ర గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. యానిమల్ బీటీఎస్ పిక్స్ ను పోస్ట్ చేసి, ఈ విధంగా రాసుకొచ్చింది..

rashmika comments about her character in animal movie

“గీతాంజలి ప్రేమ స్వచ్చమైనది, నిజమైంద, దృఢమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె కుటుంబాన్ని ఒక్క చోట చేర్చే శక్తి. కొన్ని సందర్భాల్లో నటిగా నేను గీతాంజలిని ప్రశ్నిస్తాను. అన్ని హింసలు, బాధలు నిండిన ప్రపంచంలో గీతాంజలి శాంతి, నమ్మకాన్ని, ప్రశాంతనను కలిగిస్తుంది. ఆమె తన భర్తను, పిల్లలను సురక్షితంగా ఉంచని దేవుళ్లను ప్రార్థిస్తుంది. నా దృష్టిలో గీతాంజలి చాలా అందమైన అమ్మాయి” అంటూ డీప్ గా చెప్పుకొచ్చింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన మీ ప్రేమకు ధన్యవాదాలు, అలాగే ప్రతీ మూవీని కష్టపడి చేస్తా, మీ అందరికి నా థ్యాంక్స్ అంటూ పేర్కొంది నేషనల్ క్రష్. ప్రస్తుతం రష్మిక పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. యానిమల్ విడుదలై వారం రోజులు దాటుతున్నా కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు. మరి గీతాంజలి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి