iDreamPost

అరుదైన కాంబినేషన్ – Nostalgia

అరుదైన కాంబినేషన్  – Nostalgia

చియాన్ గా అభిమానులతో ముద్దుపేరుతో పిలిపించుకునే హీరో విక్రమ్ టాలెంట్ తెలుగు వాళ్లకు తెలిసింది అపరిచితుడుతోనే. ఆ సినిమా ప్రభావం వల్ల చాలా ఏళ్ళ పాటు ఇతని చిత్రాలు డబ్బింగ్ రూపంలో వస్తూనే ఉన్నాయి.తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగే క్రమంలో విక్రమ్ చేసిన ఛాలెంజింగ్ రోల్స్ ఎన్నో ఉన్నాయి. 1990లో పరిశ్రమలో అడుగు పెట్టిన విక్రమ్ కెరీర్ ప్రారంభంలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ చేశాడు కాని అవేవి ఆశించిన ఫలితాన్ని కానీ పేరుని కానీ ఇవ్వలేకపోయాయి.

అక్క పెత్తనం చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఊహ, ఆడాళ్ళా మజాకా, మెరుపు, కుర్రాళ్ళ రాజ్యం ఇలా చాలా చేశాడు కానీ ఒకటి రెండు తప్ప ఏవి అంతగా ఆడలేదు. 2001వ సంవత్సరంలో సౌందర్యతో నటించిన 9 నెలలు కొంచెం చెప్పుకోదగ్గ పేరు ఇచ్చింది కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. దీని తర్వాత యూత్ అనే మరో చిత్రం చేస్తే అదే లాస్ట్ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ అయ్యింది. చాలా కాంటెంపరరీ సబ్జెక్టుతో దర్శకుడు క్రాంతి కుమార్ గారు తీసిన 9 నెలలు అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇందులో సౌందర్య, విక్రమ్ దంపతులుగా నటించారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భర్తకు యాక్సిడెంట్ జరిగితే పిల్లలు లేని ధనవంతుడికి సంతానం కలిగించడం కోసం సౌందర్య గర్భం అద్దెకు ఇవ్వడానికి సిద్ధ పడుతుంది. దాని వల్ల వచ్చే డబ్బుతో విక్రమ్ కు చికిత్స చేయించే ఉద్దేశంతో ఈ పని చేసినా అందరితో మాటలు పడే పరిస్థితి వస్తుంది. చివరికి ఈ ప్రయాణం ఏ గమ్యం చేరుకుందనేదే 9 నెలల కథ. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా క్రాంతి కుమార్ గారి ప్రయత్నం మెప్పు పొందింది. విక్రమ్, సౌందర్యల జంట కూడా చక్కగా కుదిరింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. ఆ తర్వాత నాలుగేళ్లకే సౌందర్య కాలం చేస్తే అదే సమయంలో విక్రమ్ వరస హిట్లతో స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి