iDreamPost

రంజీ ఛాంపియన్​గా ముంబై.. ఆ లెజెండ్​కు ఘనమైన వీడ్కోలు!

  • Published Mar 14, 2024 | 2:18 PMUpdated Mar 14, 2024 | 2:31 PM

ముంబై జట్టు అనుకున్నది సాధించింది. డొమెస్టిక్ క్రికెట్​లో తనను మించిన టీమ్ లేదని మరోమారు ప్రూవ్ చేసింది. మరోసారి రంజీ ఛాంపియన్​గా అవతరించింది.

ముంబై జట్టు అనుకున్నది సాధించింది. డొమెస్టిక్ క్రికెట్​లో తనను మించిన టీమ్ లేదని మరోమారు ప్రూవ్ చేసింది. మరోసారి రంజీ ఛాంపియన్​గా అవతరించింది.

  • Published Mar 14, 2024 | 2:18 PMUpdated Mar 14, 2024 | 2:31 PM
రంజీ ఛాంపియన్​గా ముంబై.. ఆ లెజెండ్​కు ఘనమైన వీడ్కోలు!

డొమెస్టిక్ క్రికెట్​లో తనను మించిన టీమ్ మరొకటి లేదని ముంబై మరోమారు ప్రూవ్ చేసింది. తనను కొట్టాలంటేనే అపోజిషన్ టీమ్ భయపడేలా ఆ టీమ్ విజయయాత్ర నడుస్తోంది. తాజాగా ఇది మరోమారు నిరూపితమైంది. రంజీ ట్రోఫీ-2024లో విజేతగా ఆవిర్భవించింది ముంబై. 42వ సారి ఈ టోర్నమెంట్​లో విన్నర్​గా నిలిచి రికార్డు సృష్టించింది. రంజీ ట్రోఫీ హిస్టరీలో ఎక్కువగా ఛాంపియన్​గా నిలిచిన జట్టు ముంబైనే. ఈ టీమ్ ఇప్పటిదాకా 42 సార్లు విజేతగా నిలిచింది.

ముంబై తర్వాత ప్లేసుల్లో కర్ణాటక (8), ఢిల్లీ (7) ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టోర్నమెంట్​లో ముంబై హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్​లో ముంబై నిర్దేశించిన 537 పరుగుల టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన విదర్భ.. 368 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెరీర్​లో ఆఖరి టెస్టు ఆడుతున్న డొమెస్టిక్ లెజెండ్ ధవల్ కులకర్ణి చివరి వికెట్ తీసి సంతోషంలో మునిగిపోయాడు. అప్పటికే 9 వికెట్లు పడటం, విజయానికి ఒకే వికెట్ దూరంలో ఉండటంతో కెప్టెన్ అజింక్యా రహానె వెంటనే కులకర్ణిని బౌలింగ్​కు దింపాడు. పర్ఫెక్ట్ ఇన్​స్వింగర్ వేసిన అతడు ఉమేష్​ను క్లీన్​బౌల్డ్ చేశాడు. దీంతో ముంబై జట్టు సంబురాల్లో మునిగిపోయింది. ట్రోఫీ నెగ్గడంతో కులకర్ణికి టీమ్​మేట్స్ ఘనమైన వీడ్కోలు ఇచ్చినట్లయింది.

ఎదురుగా ఉన్నది భారీ టార్గెట్ అయినా, కంటిన్యూస్​గా వికెట్లు పడతున్నా విదర్భ పట్టు వదల్లేదు. ఆ జట్టు బ్యాటర్లు మొండిగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్​గా మారింది. ఒకదశలో 350 పరుగులకు 5 వికెట్లతో విదర్భ పటిష్టంగా కనిపించింది. ఆ సమయంలో ఏదైనా సాధ్యమేనని అనిపించింది. కానీ సెంచరీ వీరుడు అక్షయ్ వాడ్కర్ (102) ఔట్ అవడంతో ఆ టీమ్ పతనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 15 పరుగుల తేడాలో మిగిలిన అన్ని వికెట్లను కోల్పోయింది విదర్భ. అక్షయ్​తో పాటు కరుణ్ నాయర్ (74), హర్ష్ దూబె (65) రాణించారు. వీళ్లు ఎంతగా ఫైట్ చేసినా కొండంత స్కోరును ఛేజ్ చేయలేకపోయారు. కానీ విదర్భ బ్యాటర్ల పోరాటపటిమను మాత్రం మెచ్చుకోవాల్సిందే. మరి.. ముంబై రంజీ విన్నర్​గా నిలవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి