iDreamPost

ప్యాన్ ఇండియా సినిమాను పట్టించుకోరా

హిట్టో హిట్టని డంకా బజాయించి చెప్పుకున్న భూల్ భూలయ్యా 2 మూడు వందల కోట్లను టచ్ చేయలేక చేతులెత్తేసింది.

హిట్టో హిట్టని డంకా బజాయించి చెప్పుకున్న భూల్ భూలయ్యా 2 మూడు వందల కోట్లను టచ్ చేయలేక చేతులెత్తేసింది.

ప్యాన్ ఇండియా సినిమాను పట్టించుకోరా

పగవాడికి కూడా వద్దనేలా ఉంది బాలీవుడ్ పరిస్థితి. ఒకపక్క సౌత్ దర్శకులు వందల వేల కోట్లు కొల్లగొట్టే సినిమాలు తీస్తుంటే హిందీ మేకర్స్ మాత్రం ఎలాంటి కంటెంట్ తో నార్త్ ఆడియన్స్ ని మెప్పించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఏది వదిలినా అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. మొన్న సామ్రాట్ పృథ్విరాజ్ ని ఎంత దారుణంగా ఛీ కొట్టారో కలెక్షన్ల సాక్షిగా ఋజువయ్యింది. హిట్టో హిట్టని డంకా బజాయించి చెప్పుకున్న భూల్ భూలయ్యా 2 మూడు వందల కోట్లను టచ్ చేయలేక చేతులెత్తేసింది. అసలే అంచనాలు లేకుండా వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ టాప్ హిట్ గా నిలవగా గంగూబాయ్ కటియావాడి సేఫ్ అయ్యింది
Ignore Pan India movie
జూలై 22న రాబోయే శంషేరా మీద ఎలాంటి బజ్ రావడం లేదు. ఇది కూడా వందల కోట్లు కుమ్మరించి నిర్మించారు. రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన ఈ గ్రాండియర్ లో సంజయ్ దత్ లాంటి సీనియర్లున్నారు. యష్ రాజ్ సంస్థ ప్రొడక్షన్ కావడంతో బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. ట్రైలర్ చూస్తేనేమో యుట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ కు దగ్గరగా ఉంది. ఏకంగా 1 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చి పడ్డాయి.


తెలుగు తమిళంతో సహా అన్ని ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ చేస్తున్నారు. అయినా కూడా అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. బిజినెస్ కూడా సోసోగా ఉందని ట్రేడ్ భయపడుతోంది. ఓపెనింగ్స్ మీద అనుమానాలున్నాయి

ఈ పరిస్థితికి కారణమేంటో తలలు పండిన ముంబై సినీ విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. దక్షిణాది కంటెంట్ తో పోల్చుకుని దానికి ఏ మాత్రం తక్కువగా ఉన్నా ఉత్తరాది ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదనే క్లారిటీ వచ్చింది. ఏ మాత్రం తేడా ఉన్నా జాన్ అబ్రహం, కంగనా రౌనత్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇలా చిన్న పెద్ద స్టార్లనే తేడా లేకుండా డిజాస్టర్లు మూటగట్టి ఇస్తున్నారు ఇలా అయితే ప్యాన్ ఇండియా పదం కేవలం టాలీవుడ్ కోలీవుడ్ కే సొంతమవుతుంది. అలా జరగకూడదనే వాళ్ళ ఆందోళన. కానీ ఎవరాపగలరు. మనవి చూస్తేనేమో పుష్ప 2 లాంటివి మొదలుకాకుండానే క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుని టాలీవుడ్ రేంజ్ ని పెంచుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి