iDreamPost
android-app
ios-app

ఈ బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్.. టాలీవుడ్ లో ఫేమస్ డైరెక్టర్! గుర్తు పట్టారా?

ఈ బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్.. టాలీవుడ్ లో ఫేమస్ డైరెక్టర్! గుర్తు పట్టారా?

సినిమాల్లోఅవకాశం రావడం అంటే ఆషామాషీ కాదు. ఇప్పుడు అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ గా అవకాశాలు కొట్టేసిన వాళ్లు కూడా ఉన్నారు. యూట్యూబ్ లో వీడియోలు, ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ హీరోయిన్స్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ, అప్పట్లో సినిమా అవకాశం కోసం ఖడ్గం సినిమాలోలా ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి నుంచి ఫేమస్ హీరోలు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆ కోవకు చెందిన వాడే. కెరీర్ లో ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు ఒక గొప్ప డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది టాప్ హీరోలను డైరెక్ట్ చేశాడు. అయితే అతను కెరీర్ స్టార్టింగ్ లో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగా చేశాడని చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పాత సినిమా ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అరె.. ఈయన ఫేమస్ డైరెక్టర్ కదా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ ఫొటో షేర్ చేసింది మరెవరో కాదు.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

శివ సినిమా సమయంలో ఒక స్టిల్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఉంది మరెవరో కాదు.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆర్జీవీ- పూరీ మధ్య ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే తన శిష్యులు అందరిలో ఆర్జీవీకి పూరీ జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టం. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చాలా ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇప్పుడు ఆ పిక్ షేర్ చేయడంతో అందరూ ఆ సినిమా ఇన్నిసార్లు చూశాం. కానీ, పూరీని గుర్తు పట్టలేకపోయామే అంటూ కామెంట్ చేస్తున్నారు.

పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే.. ఆయన డైరెక్షన్ గురించి ఆయన సినిమాల గురించి కామెంట్ చేయడానికి ఏమీ ఉండదు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఈ మధ్య పూరీ కాస్త గాడి తప్పాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు లైగర్ సినిమా ఫ్లాప్ కావడమే కారణం. అయితే రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 అనౌన్స్ మెంట్ చేశాడు. మళ్లీ పూరీ తిరిగి ఫామ్ లోకి వస్తాడంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అలాంటి సినిమాకి సీక్వెల్ అనగానే ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet