iDreamPost

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. ఆ రోజే పేరు పెడతామన్న రామ్ చరణ్

  • Author Soma Sekhar Published - 03:33 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 03:33 PM, Fri - 23 June 23
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన.. ఆ రోజే పేరు పెడతామన్న రామ్ చరణ్

రామ్ చరణ్-ఉపాసనలు ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం మనందరికి తెలసిందే. మెగా కోడలు ఉపాసన జూన్ 20న పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా ఇంట సంబరాలు ఆకాశాన్ని తాకాయి. మెగా అభిమానులు ఈ వేడుకను ఓ జాతరలా జరుపుకున్నారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో.. శుక్రవారం (జూన్ 23)న ఉపాసనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నా కూతురు అచ్చం నాలాగే ఉందని బిడ్డను పట్టుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు రామ్ చరణ్.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ..”ఈ రోజు పాపను, ఉపాసనను తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. చాలా సంవత్సరాలుగా ఈ రోజు కోసం ఎదురుచూశాం. అనుకున్న టైమ్ లోనే ఆ భగవంతుడు మాకు పాపను ప్రసాదించారు. మీ ఆశీస్సులు ఇలాగే ఎల్లప్పుడు మా పాపకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇద్దరిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్న ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి నా ధన్యవాదాలు. అలాగే అభిమానుల ప్రార్థనలు కూడా మర్చిపోలేను. ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను” అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఓ పేరును నేను, ఉపాసన అనుకున్నామని.. అది 21వ రోజున మీ అందరికి తెలియపరుస్తానని రామ్ చరణ్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి