iDreamPost

Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. షారుఖ్ ను వెనక్కి నెట్టి మరీ..

  • Author Soma Sekhar Published - 12:48 PM, Sat - 9 December 23

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి మరీ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్నాడు మెగా హీరో.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి మరీ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకున్నాడు మెగా హీరో.

  • Author Soma Sekhar Published - 12:48 PM, Sat - 9 December 23
Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. షారుఖ్ ను వెనక్కి నెట్టి మరీ..

RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ మూవీలో చరణ్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులతో పాటుగా హాలీవుడ్ రైటర్లు చరణ్ యాక్టింగ్ ను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో పలు హాలీవుడ్ అవార్డులను సైతం దక్కించుకున్నాడు మెగాపవర్ స్టార్. తాజాగా మరో అరుదైన అవార్డును దక్కించుకుని అభిమానులను ఖుషీ చేశాడు. బాలీవడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ను వెనక్కి నెట్టి మరీ ఈ అంతర్జాతీయ అవార్డును దక్కించుకున్నాడు చరణ్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘పాప్ గోల్డెన్ అవార్డ్స్’ లో రామ్ చరణ్ కు ‘గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్’ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఇక అవార్డు కోసం చరణ్ తో పాటుగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, దీపికా పదుకొణె, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా నామినేషన్స్ లో పోటీపడ్డారు. వారందరిని వెనక్కి నెట్టిమరీ ఈ అవార్డును దక్కించుకున్నాడు చెర్రీ. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు పలు హాలీవుడ్ అవార్డులు అందుకున్నాడు ఈ మెగాహీరో. ఇప్పుడు మరోసారి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకుని మరో మెట్టు పైకి ఎదిగాడు. కాగా.. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మరి చెర్రీ ఈ అవార్డు అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి