iDreamPost

Ram Charan : రామ్ చరణ్ మాస్ లైనప్.. మరో ప్యాన్ ఇండియా హీరో ఇన్ మేకింగ్!

Ram Charan : రామ్ చరణ్ మాస్ లైనప్.. మరో ప్యాన్ ఇండియా హీరో ఇన్ మేకింగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ లైనప్ మామూలుగా లేదు. తన కెరియర్ లో 12వ సినిమా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో చేసి, వినయ విధేయ రామ లాంటి ఒక భారీ డిజాస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత చేస్తున్న అన్ని సినిమాలు ఆసక్తికరంగా మారి పోయాయి. సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్న రామ్ చరణ్ ఏకంగా ఇప్పుడు తన కెరియర్ మొత్తాన్ని ప్యాన్ ఇండియా లెవల్ కి తీసుకు వెళ్ళిపోయాడు. ఇప్పటికే రామ్ చరణ్ 13వ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు రాజమౌళి మార్కెట్ దృష్ట్యా అన్ని భారతీయ భాషల్లోనే కాక అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల అవుతోంది.

ఇక రామ్ చరణ్ 14వ సినిమాగా ఆచార్య రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి చిరంజీవి సినిమా అయినా రామ్ చరణ్ పాత్ర కూడా పెద్దదే కావడంతో ఆయనకు కూడా సినిమా కలిసి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ అయ్యే సమయానికి ఇతర దక్షిణాది భాషల్లో విడుదల చేసే అవకాశాలు కూడా లేక పోలేదు. ఇక రామ్ చరణ్ 15వ సినిమా ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శంకర్ మార్కెట్ దృష్ట్యా అలాగే ఆర్ఆర్ఆర్, ఆచార్యల తరువాత పెరిగే చరణ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఇదిలా ఉండగా దసరా సందర్భంగా రామ్ చరణ్ నుంచి రెండు ఆసక్తికర ప్రకటనలు వచ్చాయి. అందులో 16వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉండగా 17వ సినిమాకి సంబంధించిన హింట్ ఉంది. రామ్ చరణ్ తన 16 సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్లుగా ప్రకటించాడు. గతంలో నాని హీరోగా జెర్సీ సినిమా రూపొందించిన ఈ దర్శకుడు నేషనల్ అవార్డు కూడా సాధించాడు. ఆయన దర్శకత్వంలోనే రామ్ చరణ్ 16వ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను ప్రభాస్ కు చెందిన యు.వి.క్రియేషన్స్ అలాగే ఠాగూర్ మధుకి సంబంధించిన ఎన్విఆర్ ఫిలిమ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. కచ్చితంగా అక్కడ కూడా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గౌతమ్ తిన్ననూరి- రామ్ చరణ్ సినిమాని కూడా హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రకటన చేసిన తర్వాత సాయంత్రం సమయంలో రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఒక ఫోటోను పంచుకున్నారు. ఇదే ఫోటో ని ప్రశాంత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా పంచుకుంది. వీరు సినిమా చేస్తున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుండగా అప్పుడు అది నిజమే అని హింట్ ఇచ్చేశారు. బహుశా సినిమాను అధికారికంగా ప్రకటించడానికి ఏదైనా ముహూర్తం పెట్టుకున్నారు ఏమో తెలియదు. ఒకవేళ అన్నీ కుదిరితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ అలాగే రామ్ చరణ్ ఇద్దరి మార్కెట్ ను బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్యాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ కానుంది. మొత్తం మీద రామ్ చరణ్ లైనప్ చూస్తే మాత్రం తెలుగు నుంచి మరో పాన్ ఇండియా హీరో దొరికేశాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Also Read : Prakash Raj MAA Elections : ‘మా’ క్లైమాక్స్ ఇప్పట్లో ఉండదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి