iDreamPost

Ram Charan : నార్త్ మార్కెట్ మీద చరణ్ కన్ను

Ram Charan : నార్త్ మార్కెట్ మీద చరణ్ కన్ను

ఏ ఉద్దేశంతో ట్రిపులార్ తర్వాతే ఆచార్య విడుదల ఉండాలని రాజమౌళి కండీషన్ పెట్టాడో కానీ అది ఇప్పుడది కొణిదెల అండ్ మ్యాట్నీ సంస్థలకు వరంగా మారబోతోంది. అల్లూరి సీతారామరాజు గెటప్ ని నార్త్ ఆడియన్స్ శ్రీరాముడిగా భావించడం వల్ల అక్కడ రామ్ చరణ్ ఇమేజ్ ఉన్నట్టుండి ఎగబాకింది. దానికి తోడు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోవడంతో ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. జంజీర్ లో చూసింది ఇతన్నేనా అని సీనియర్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. కొంత అతిశయోక్తిగా అనిపించినా ఇదంతా వాస్తవం. ఇప్పుడీ పరిణామం నేరుగా ఆచార్యకు పెద్ద వరంగా మారబోతోంది. ఎలా అని అడిగితే దీనికి చాలా కారణాలున్నాయి.

ఆర్ఆర్ఆర్ వచ్చిన 34 రోజులకే ఆచార్య థియేటర్లలో అడుగు పెడుతుంది. చరణ్ రేంజ్ స్టార్ హీరోకి ఇది చాలా చాలా తక్కువ గ్యాప్. ఇందులో చేసింది అరగంట పాత్రే అయినా అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. పైగా చిరంజీవి కాంబినేషనే కాబట్టి హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. దీంతో సహజంగానే హిందీ వెర్షన్ కు డిమాండ్ పెరుగుతుంది. రామ్ చరణ్ కొత్త సినిమా అనగానే ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. పైగా హక్కులు తీసుకున్నది పెన్ స్టూడియోస్. డిస్ట్రిబ్యూషన్ గట్టిగా చేస్తారు. స్క్రీన్లు బాగా దొరుకుతాయి. ఎగ్జిబిటర్లు సైతం డిమాండ్ చేస్తారు. సినిమా బాగుంటే ఇక జరిగేది చెప్పనక్కర్లేదు.

సైరా తర్వాత మెగాస్టార్ సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మాములుగా లేదు. ఆర్ఆర్ఆర్ హడావిడి తగ్గగానే ఆచార్య ప్రమోషన్లు మొదలుపెడతారు. మ్యాట్నీనే నిర్మించిన మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1 విడుదల కానుంది. దాని రన్ పూర్తి చేశాక చిరు మూవీకి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడానికి కారణం కూడా ఇదే. ఆచార్య విషయంలో సరైన అప్ డేట్స్ లేక అసంతృప్తితో ఉన్న అభిమానులకు ఆ లోటు పూర్తిగా తీరేలా ట్రైలర్ సిద్ధం కాబోతోందట. ఏప్రిల్ 14న వచ్చే కెజిఎఫ్ 2 తర్వాత అతి పెద్ద సినిమా ఆచార్యనే అవుతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాకు సంగీతం మణిశర్మ

Also Read : Jr NTR : ఆసక్తి రేపుతున్న తారక్ లైనప్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి