iDreamPost

రామ్ చరణ్ చేయాల్సిన కథతో విజయ్ దేవరకొండ?

  • Published Feb 29, 2024 | 2:19 PMUpdated Feb 29, 2024 | 2:21 PM

ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో కామనే. ఇప్పుడు ఇద్దరు హీరోల విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. రామ్ చరణ్ చేయాల్సిన స్టోరీ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందని అంటున్నారు.

ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో కామనే. ఇప్పుడు ఇద్దరు హీరోల విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. రామ్ చరణ్ చేయాల్సిన స్టోరీ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్లిందని అంటున్నారు.

  • Published Feb 29, 2024 | 2:19 PMUpdated Feb 29, 2024 | 2:21 PM
రామ్ చరణ్ చేయాల్సిన కథతో విజయ్ దేవరకొండ?

గతేడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా శాండల్​వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మరో దర్శకుడు నర్తన్ కూడా ఆ పార్టీలో కనిపించారు. ఆ సమయంలో ఈ ఇద్దరు దర్శకులతో రామ్ చరణ్ సినిమాలు చేస్తారని అనేక పుకార్లు షికారు చేశాయి. అంతే కాకుండా చరణ్​కు దగ్గర స్నేహితులైన యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్​లో నర్తన్-చరణ్ కాంబినేషన్​లో బిగ్ బడ్జెట్ సినిమా చేస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్టుపై వచ్చిన రూమర్స్ మాత్రం నిజం కాలేదు.

అలా చాలా కాలంగా డైరెక్టర్ నర్తన్ ఎదురు చూసినా రామ్ చరణ్​తో సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇది కుదరకపోవడంతో ఈ దర్శకుడు ఇప్పుడు మరో యంగ్ స్టార్ హీరో వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను నర్తన్ సంప్రదిస్తున్నారని, అన్నీ కుదిరితే త్వరలోనే వీరిద్దరూ కలిసి ఫిల్మ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్​కు సిద్ధంగా ఉండగా.. గౌతమ్ తిన్ననూరి సినిమాను ఆ తర్వాత పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం మరో రెండు మూవీస్ కూడా లైన్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతకు ముందు కూడా ఒకసారి రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఒకటి విజయ్ దేవరకొండ వద్దకు వచ్చింది. పైన చెప్పిన గౌతమ్ తిన్ననూరి చిత్రం మొదట రామ్ చరణ్ చేయాల్సింది. కానీ ఆ సినిమా చివరికి విజయ్ వద్దకు చేరుకుంది. మరి ఇప్పుడు నర్తన్​తో మూవీ నిజంగా ఉంటుందో లేదో చూడాలి. కన్నడలో ‘మఫ్టీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన నర్తన్.. మాస్ ఫిల్మ్స్ తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో రౌడీ స్టార్​తో కన్నడ డైరక్టర్ సినిమా గనక తీస్తే ఎలా ఉంటుందో అని విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. విజయ్​ నుంచి మాస్ మూవీ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నాగబాబు నోటి దురుసు వ్యాఖ్యలు.. ఆపై క్షమాపణలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి