iDreamPost

దళపతి విజయ్ ‘లియో’లో రామ్ చరణ్! ఇలా హింట్ ఇచ్చేశారా..?

  • Author ajaykrishna Published - 07:46 AM, Mon - 31 July 23
  • Author ajaykrishna Published - 07:46 AM, Mon - 31 July 23
దళపతి విజయ్ ‘లియో’లో రామ్ చరణ్! ఇలా హింట్ ఇచ్చేశారా..?

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘లియో’ రెడీ అవుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. LCU(లోకి సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగా రాబోతుంది. ఇప్పటికే ఖైదీ, విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ దృష్టిని తనవైపు తిప్పుకున్న లోకేష్.. ఈసారి దళపతి విజయ్ హీరోగా లియోని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మాస్టర్ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ పర్సనాలిటీస్ సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ లాంటివారు కీలకపాత్రలలో నటిస్తున్నారు. మాస్టర్ ఫేమ్ లలిత్ కుమార్ ఈ లియో మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇక లియో నుండి ఇప్పటికే సాంగ్స్, గ్లింప్స్ రూపంలో ప్రమోషనల్ స్టఫ్ రిలీజ్ చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో ఆల్రెడీ లియోపై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఎందుకంటే.. దిల్లీగా కార్తీ, విక్రమ్ గా కమల్ హాసన్, రోలెక్స్ గా సూర్య లను ఎలా ప్రెజెంట్ చేసి.. స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ చేశారో తెలిసిందే. అదంతా డైరెక్టర్ లోకేష్ మాస్టర్ ప్లాన్. ఈసారి తన సినిమాటిక్ యూనివర్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ.. ఏకంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని రంగంలోకి దింపేశాడు. కట్ చేస్తే.. తాజాగా సంజయ్ దత్ బర్త్ డే సందర్బంగా.. లియో నుండి ఆయన ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు. ఆంటోనీ దాస్ క్యారెక్టర్ లో సంజయ్ కనిపించనున్నారు.

సంజయ్ దత్ క్యారెక్టర్ చూశాక సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. ఎందుకంటే.. ఆంటోనీ దాస్ గా ఆయన లుక్ ఒక ఎత్తు అయితే.. ఆయన్ని హైలైట్ చేస్తూ అనిరుధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అందులోనూ వీడియోలో ఒకే ఒక్క డైలాగ్ ఉంది. అదికూడా ఆంటోనీ అని ఎవరో పిలుస్తున్నట్లు ఉంది. ఇప్పుడదే డైలాగ్.. ఇండస్ట్రీలో సెన్సేషన్ కి దారి తీసింది. ఆ వాయిస్ అచ్చం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ లా ఉండటం విశేషం. సరిగ్గా గమనిస్తే చరణ్ వాయిస్ ఫిక్స్ అనిపిస్తుంది. దీంతో ఎప్పటినుండో లోకేష్, చరణ్ ల కాంబో హాట్ టాపిక్ గా సాగుతుంది. కాబట్టి.. ఇప్పుడు లియోలో చరణ్ ఎంట్రీ ఫిక్స్ అని కథనాలు వినిపిస్తున్నాయి. అదే మ్యాటర్ ని డైరెక్టర్ ఇలా హింట్ ఇచ్చాడని అంటున్నారు ఫ్యాన్స్. మరి లియోలో చరణ్ ఉంటే.. LCU క్రేజ్ మరో స్థాయికి చేరుతుంది. మరి ఇది నిజమా కాదా తెలియాలంటే అక్టోబర్ 19న మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. మరి లియోలో రామ్ చరణ్ ఉంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి