iDreamPost

రామ్ ‘స్కంద’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్! శ్రీలీల డ్యాన్స్‌ చూస్తే మతి పోతుంది!

  • Author singhj Updated - 01:06 PM, Thu - 3 August 23
  • Author singhj Updated - 01:06 PM, Thu - 3 August 23
రామ్ ‘స్కంద’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్! శ్రీలీల డ్యాన్స్‌ చూస్తే మతి పోతుంది!

టాలీవుడ్​లో మాస్ డైరెక్టర్లు చాలా మందే ఉన్నారు. కానీ వారిలో మోస్ట్ సక్సెస్​ఫుల్​ దర్శకుడిగా కొనసాగుతున్నారు బోయపాటి శ్రీను. ‘భద్ర’, ‘సింహా’, ‘లెజెండ్’, ‘సరైనోడు’, ‘అఖండ’ లాంటి చిత్రాలు ఆయన్ను మాస్ ఆడియెన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకునేలా చేశాయి. బోయపాటి తీసే చిత్రాలు పైకి మాస్ మూవీస్​లా కనిపించినా వాటిలో ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంతర్లీనంగా ఉంటాయి. కథలో భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లను ఎక్కువగా రాసుకుంటారాయన. వాటి చుట్టూ ఫైట్లను అల్లుకుంటారు. అందుకే ఎమోషన్​తో విలన్లను హీరో చితకబాదుతుంటే సీన్లు బాగా పండుతాయి.

ఈ ఫార్ములాతో పక్కా కమర్షియల్, మాస్ ఎంటర్​టైనర్స్ తీయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తులుగా మారారు. బాలయ్యతో ‘అఖండ’ మూవీ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ సమయంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని​తో మూవీ చేసేందుకు బోయపాటి రెడీ అయ్యారు. వీరి కాంబోలో వస్తున్న ఫిల్మ్ ‘స్కంద’. ఇందులో రామ్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా యాక్ట్ చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్​కు సరైన హిట్ పడలేదు. ఎన్నో అంచనాలతో రిలీజైన ‘వారియర్’ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో బోయపాటిపై గంపెడాశలు పెట్టుకున్నారు రామ్.

‘స్కంద’ మూవీ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నీ చుట్టూ చుట్టూ’ అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డ్యాన్స్​ ఇరగదీస్తారనే పేరున్న రామ్​, శ్రీలీల తమపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నారు. రామ్​ ఎప్పటిలాగే అదరగొట్టేశారు. శ్రీలీల అయితే తన అందంతో డ్యాన్స్​తోనూ కట్టిపడేశారు. ఇందులో ఆమె మూతి తిప్పడం, నడుము తిప్పడం చూస్తే కుర్రాళ్ల గుండెలు మరింత స్పీడ్​గా కొట్టుకోవడం ఖాయం. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ బీట్స్​కు తగ్టట్లుగా రామ్, శ్రీలీల వేసిన స్టెప్పులు సూపర్బ్ అనే చెప్పాలి. మరి.. ‘నీ చుట్టూ చుట్టూ’ సాంగ్​ను మీరు చూశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి