iDreamPost

రజినీకాంత్ మూవీకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఆ? ‘లాల్ సలామ్’ ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే?

Lal Salaam Movie First Day Collections: రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ లాల్ సలామ్. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. దీంతో రజినీ రేంజ్ కు ఇలాంటి వసూళ్లు రావడం ఏంటని సినీ పండితులు ఆశ్చర్యపోతున్నారు.

Lal Salaam Movie First Day Collections: రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన మూవీ లాల్ సలామ్. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఫస్ట్ డే దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. దీంతో రజినీ రేంజ్ కు ఇలాంటి వసూళ్లు రావడం ఏంటని సినీ పండితులు ఆశ్చర్యపోతున్నారు.

రజినీకాంత్ మూవీకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఆ? ‘లాల్ సలామ్’ ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ ఫిల్మ్ తో వరల్డ్ వైడ్ గా దాదాపు 700 కోట్లు కొల్లగొట్టాడు సూపర్ స్టార్. ఇక జైలర్ మూవీ తర్వాత తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘లాల్ సలామ్’. ఇందులో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు తలైవా. రవితేజ ఈగల్ మూవీతో పాటు ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజు ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో రజినీ మూవీకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతకీ లాల్ సలామ్ డే వన్ లో రాబట్టిన సొమ్ము ఎంతో ఇప్పుడు చూద్దాం.

రజినీకాంత్ మూవీ వస్తుందంటే చాలు ఇండియా మెుత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటుంది. కొన్ని కంపెనీలు ఏకంగా ఆరోజు తమ ఉద్యోగులకు సెలవులు కూడా ఇస్తాయి. ఇటీవలే జైలర్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టిన రజినీ.. తాజాగా లాల్ సలామ్ అంటూ తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రజినీతో పాటుగా విష్ణు విశాల్, విక్రాంత్ లు లీడ్ రోల్స్ చేశారు. తాజాగా విడుదలైన ఈ మూవీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తో తలైవా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాడు. రజినీ రేంజ్ కు వచ్చే వసూళ్లు ఇవి కానే కావని అభిమానులు వాపోతున్నారు.

lal salam day 1 collections

ఇండియా వైడ్ గా లాల్ సలామ్ తొలిరోజు కేవలం రూ. 4.3 కోట్లు మాత్రమే వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో ఈ కలెక్షన్లు చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ పండితులు ఆశ్చర్యపోతున్నారు. తలైవా మూవీకి మరీ ఇంతదారుణమైన కలెక్షన్లు రావడం ఏంటని షాక్ కు గురవుతున్నారు. అయితే తెలుగులో జీరో పబ్లిసిటీ కారణంగా పలు చోట్ల మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. ఇది కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపింది. ఈ లెక్కన చూసుకుంటే.. రజినీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడం కష్టంగానే ఉంది. ఇక ఈ మూవీలో కేవలం 40 నిమిషాలు మాత్రమే రజినీ కనిపించాడని.. ఇందుకోసం ఏకంగా రూ. 40 కోట్లు పారితోషికం అందుకున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. మరి రజినీ మూవీకి ఫస్ట్ డే ఇంత తక్కువ వసూళ్లు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పుష్ప-2 షూటింగ్‌లో అల్లు అర్జున్‌కు ప్రమాదం.. పిక్ వైరల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి