iDreamPost

Rajinikanth: తరచుగా ఆ హస్త ముద్రలతో రజినీకాంత్‌.. వాటి వెనకున్న రహస్యం ఇదే!

రజినీకాంత్‌ తరచుగా తన చేతి వేళ్లను ముడిచి పెట్టి ఉంచూ ఉన్న దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన అలా పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి?..

రజినీకాంత్‌ తరచుగా తన చేతి వేళ్లను ముడిచి పెట్టి ఉంచూ ఉన్న దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన అలా పెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి?..

Rajinikanth: తరచుగా ఆ హస్త ముద్రలతో రజినీకాంత్‌.. వాటి వెనకున్న రహస్యం ఇదే!

రజనీకాంత్.. ఈ పేరుకు ముందు సూపర్ స్టార్ అని పెట్టకపోతే కాస్త వెలితిగా ఉంటుంది. అటు సినిమా రంగంలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఒక సాధారణ బస్సు కండెక్టర్ స్థాయి నుంచి ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రపంచం గుర్తించిన సూపర్ స్టార్ అయినా కూడా మూలాలు మాత్రం మరిచిపోలేదు. ఎంత పైకి ఎదిగినా ఒదిగే ఉండటం ఆయన స్వభావం. సినిమాల్లో ఎంతో స్టైల్‌గా కనిపించే రజినీ.. బయట చాలా సాధాసీదాగా ఉంటారు.

 ఆధ్యాత్మికత విషయంలో రజినీకి నమ్మకం ఎక్కువ. దేవుళ్లను ఎంతగానో నమ్ముతారు. భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమతుల్యంగా నడిపిస్తూ ఉంటారు. షూటింగ్‌లకు ఎక్కువ గ్యాప్‌ దొరికితే.. గుళ్లకో.. హిమాలయాలకో వెళుతూ ఉంటారు. ఎక్కువగా దైవ చింతనలో గడుపుతూ ఉంటారు. ఇక, అసలు విషయానికి వస్తే.. రజినీకాంత్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.  ఆయన తన చేతి బొటన వేలును చూపుడు వేలుని కలిపి ఉంచిన దృశ్యాలు అవి.

రజినీ తరచుగా అలా ఎందుకు పెడుతున్నారు. దాని వెనుక ఆంతర్యం ఏమిటి?… యోగా శాస్త్రం ప్రకారం శరీరంలోని ప్రతీ అవయవాన్ని కదిలించే శక్తి చేతి వేళ్ళకు ఉంటుంది. అందులోను చేతి వేళ్ళ కొనలకు అతీత శక్తులు ఉంటాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. చేతి వేలి కొనలను కలిపి ఉంచడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని యాక్టీవ్ గా ఉంచుకోవచ్చు. ఇటువంటి ఓ సాధనను యోగ ముద్రగా భావిస్తారు. చేతి వేళ్ళతో వేసే ఈ ముద్రల వలన ఒత్తిడి, మానసిక అలసట, నీరసం ఇటువంటివన్నీ దూరం అవుతాయి.

ఈ ముద్రలు వేయడానికి ప్రత్యేకించి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. వీటిని ఎప్పుడైనా ఎక్కడైనా వేయవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో బొటన వేలు కొనను.. చూపుడు వేలు కొనతో కలిపి ఉంచే ఈ ముద్రను జ్ఞాన ముద్ర అంటారు. ఇది అత్యంత సాధారణ ముద్ర. దీని వలన ఏకాగ్రత, జ్ఞానం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.

అంతేకాకుండా ఈ ముద్రను ప్రశాంతంగా నిలుచుని ఉన్నపుడైనా, కూర్చుని ఉన్నపుడైనా.. ఇలా ఎపుడైనా వేయవచ్చు. ఇక, రజినీ సినిమాల విషయాని కొస్తే ఈ ఏడాది జైలర్ సినిమాతో ఆయన సూపర్‌ హిట్ అందుకున్నారు. లాల్ సలాంతో త్వరలో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. లాల్ సలాం సినిమాకు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. మరి, రజినీకాంత్ యోగ ముద్రలు వేయటంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి