iDreamPost

వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

ఎండలు మండిపోతున్నాయి. వీటికి తోడు వడగాల్పులు వీస్తున్నాయి. కాసేపు బయట నుంచుంటే చెమటలు పట్టేస్తున్నాయి. ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్నారు. ఈ సమయంలో తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ

ఎండలు మండిపోతున్నాయి. వీటికి తోడు వడగాల్పులు వీస్తున్నాయి. కాసేపు బయట నుంచుంటే చెమటలు పట్టేస్తున్నాయి. ప్రజలు తీవ్ర అసహనానికి గురౌతున్నారు. ఈ సమయంలో తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ

వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

ఎండాకాలం మొదలై నెల కూడా పూర్తి కాలేదు. కానీ ఎండలు మండిపోతున్నాయి. బయటే కాదు ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. వేడి గాలులు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడు భగ భగా నిప్పులు చిమ్ముతున్నాడు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 44 డిగ్రీలను దాటిపోతున్నాయి ఎండలు. సూర్య రశ్మి తాపానికి భూమి మరింత వేడెక్కుతోంది. పనులపై బయటకు వెళుతున్న వారు ఈ ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. కాగా, తెలంగాణలో కూడా గతం కన్నా ఇప్పుడు ఉష్ణోగ్రలు ఎక్కువగా రెడీ అవుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి.ఇప్పుడు తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ.

తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం నుండే ఈ వానలు కురిసే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే పలు జిల్లాలో వడగాల్పులు కూడా వీచనున్నాయని హెచ్చరించింది. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యా పేట, నల్గొండ, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం నుండి సోమవారం వరకు తేలికపాటి నుండి భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో వడగాలులు వీస్తాయని.. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కరీంనగర్, భూపాల పల్లి, నిజామాబాద్‌, జగితాల్య, ములుగు, పెద్దపల్లి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, మెదక్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి