iDreamPost

తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. ఎన్ని రోజులంటే?

తెలంగాణకు మళ్లీ వర్ష సూచన.. ఎన్ని రోజులంటే?

గత వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగి పోర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా గ్రామాలు మొత్తం వరద నీటితో మునిగిపోయాయి. ములుగు జిల్లాలోని జంపన్న వాగుకు వరద నీరు పోటేత్తడంతో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం అంతా మునిగిపోయింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదే కాకుండా భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు గ్రామం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఈ భారీ వర్షానికి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది. దీనిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్పందించి వరద బాధితులకు అండగా ఉండి నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చాయి. ఇదిలా ఉంటే.. గత మూడు రోజుల నుంచి వర్షాలు కాస్త బ్రేక్ ఇవ్వడంతో ప్రజులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాల దాటికి మిగిలిపోయిన పనులు చేసుకుంటూ బిజీగా మారిపోయారు.

ఇక ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రజలు కాస్త బయటపడ్డామనుకునేలోపే.. త్వరలో తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు ఆదివారం రాష్ట్రంలో పశ్చిమ దిక్కు నుంచి ఈదురు గాలులు వీయనున్నాయి. దీని ప్రభావంతో ఆగస్టు 1 కుమురం భీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు రానున్న మూడు రోజుల్లో మరోసారి వర్షసూచన ఉండడంతో ప్రజలు భయపడిపోతున్నారు.

ఇది కూడా చదవండి: వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. ఆందోళనలో స్థానికులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి