iDreamPost

Rahul Dravid: కోహ్లీ టీమ్‌లోకి వస్తున్నాడా? లేదా? కోచ్‌ ద్రవిడ్‌ నుంచి బిగ్‌ అప్డేట్‌!

  • Published Feb 05, 2024 | 7:02 PMUpdated Feb 05, 2024 | 7:02 PM

ఇంగ్లండ్‌పై రెండో టెస్ట్‌ గెలిచిన టీమిండియా.. మూడో టెస్టుకు మరింత పటిష్టంగా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. గాయంతో దూరమైన కేఎల్‌ రాహల్ జట్టులోకి తిరిగి రానున్నాడు. అలాగే విరాట్‌ కోహ్లీ కమ్‌బ్యాక్‌పై ద్రవిడ్‌ తాజాగా ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుతం విజయం సాధించింది. తొలి టెస్టులో గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను.. 106 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. రెండో టెస్టులో గెలిచినా.. టీమిండియాలో చాలా లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టీమిండియా చాలా అంటే చాలా బలహీనంగా ఉంది. రోహిత్‌ శర్మ తప్పితే.. మిగతా బ్యాటర్లంతా అంత అనుభవం లేని వాళ్లు కావడంతో.. ఆ ప్రభావం బ్యాటింగ్‌పై పడుతోంది. అనుభవం ఉన్న రోహిత్‌ శర్మ సైతం బ్యాడ్‌ ఫామ్‌లో ఉండటం మరింత ఇబ్బంది కరంగా మారింది.

తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌ గురించి పక్కనపెడితే.. గెలిచిన రెండో మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్‌ అత్యంత చెత్తగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ 209 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడకపోయి ఉంటే.. మళ్లీ ఓటమే ఎదురయ్యేది. రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీతో ఆదుకున్నాడు. ఇలా ఒక ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క బ్యాటరో ఆడుతున్నాడు. జట్టు బ్యాటింగ్‌ లైనప్‌లో నిలకడ లేకుండా పోతుంది. అందుకే.. భారత క్రికెట్‌ అభిమానులంతా విరాట్‌ కోహ్లీ ఎప్పుడు తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్నారు. కోహ్లీ వస్తే.. టీమిండియా బ్యాటింగ్‌ బలంగా మారుతుందని అంటున్నారు.

ఈ క్రమంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ విరాట్‌ కోహ్లీ కమ్‌బ్యాక్‌ గురించి మంచి అప్డేట్‌ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. చివరి మూడు టెస్టులకు వస్తాడని అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇంకా దానిపై ఎలాంటి ప్రకటనలేకపోవడంతో కంగారు పడుతున్నారు. వారందరికీ ద్రవిడ్‌ ప్రకటన కాస్త ఊరటనిచ్చింది. విరాట్‌ కోహ్లీతో తాము టచ్‌లో ఉన్నట్లు, మిగిలిన మూడు టెస్టులకు అందుబాటు గురించి కోహ్లీతో మాట్లాడాతమని చెప్పాడు. దీంతో.. కోహ్లీని మూడో టెస్టుకు బరిలోకి దింపేందుకు ద్రవిడ్‌ సిద్ధంగా ఉన్నాడని, కోహ్లీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే చాలాని ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి