iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్ పై సిరీస్ విజయం.. ద్రవిడ్ ను ఎప్పుడూ ఇలా చూసుండరు! వీడియో వైరల్

  • Published Feb 27, 2024 | 8:17 AM Updated Updated Feb 27, 2024 | 8:53 AM

ఇంగ్లండ్ పై చిరస్మరణీయ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్, దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటి వరకు ద్రవిడ్ ను ఇలా చూసి ఉండరు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇంగ్లండ్ పై చిరస్మరణీయ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్, దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటి వరకు ద్రవిడ్ ను ఇలా చూసి ఉండరు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Feb 27, 2024 | 8:17 AMUpdated Feb 27, 2024 | 8:53 AM
ఇంగ్లండ్ పై సిరీస్ విజయం.. ద్రవిడ్ ను ఎప్పుడూ ఇలా చూసుండరు! వీడియో వైరల్

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 3-1తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన కీలకమైన నాలుగో మ్యాచ్ లో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి.. అద్భుతమైన విజయాన్ని సాధించారు. దీంతో 11 ఏళ్లుగా స్వదేశంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే వస్తోంది. స్వదేశంలో వరుసగా రికార్డు స్థాయిలో 17 సిరీస్ ల్లో విజయాలు సాధించింది. అయితే ఈ చిరస్మరణీయ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్, దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పటి వరకు ద్రవిడ్ ను ఇలా చూసి ఉండరు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

రాహుల్ ద్రవిడ్.. టీమిండియా వాల్ గా ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు సుపరిచితుడే. తనదైన బ్యాటింగ్ తో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో వివాదరహితుడిగా ఉన్న అతికొద్ది మంది ఆటగాళ్లలో ద్రవిడ్ ఒకడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న అతడు.. జట్టుకు తిరుగులేని విజయాలను అందిస్తూ వస్తున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో సైతం భారత్ ను ఫైనల్ వరకూ తీసుకెళ్లడంలో మిస్టర్ డిఫెండబుల్ పాత్ర మరువలేనిది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఇంగ్లండ్ పై రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్ట్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది.

అయితే భారత వికెట్ కీపర్, యంగ్ ప్లేయర్ ధృవ్ జురెల్ విన్నింగ్ షాట్ కొట్టడంతో.. ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో సంతోషం వెల్లివిరిసింది. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యాడు. ఓ దిగ్గజ క్రికెటర్ గా ఎన్నో మ్యాచ్ ల్లో విజయాలు, పరాజయాలను చవిచూసిన ద్రవిడ్ ను ఇలా ఎప్పుడూ చూసుండరు. కుర్రాళ్ళను తీర్చిదిద్దుతూ అహోరాత్రులు శ్రమిస్తున్న ద్రవిడ్ కు కష్టానికి ఫలితం దక్కడంతో.. పట్టరాని సంతోషంతో భావోద్వేగానికి లోనైయ్యాడు. జురెల్, గిల్ ను గట్టిగా కౌగిలించుకుని అభినందనలు తెలిపాడు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇటు ద్రవిడ్ ఫ్యాన్స్, అటు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నేళ్ళ క్రికెట్ కెరీర్ లో ద్రవిడ్ సర్ ను ఇలా ఎప్పుడూ చూడలేదని, ఈ వీడియో చూస్తుంటే.. కళ్లు చెమ్మగిల్లుతున్నాయి అంటూ రాసుకొస్తున్నారు.

ఇదికూడా చదవండి: ఈ ఏజ్ లో కూడా ఆ కొట్టుడేంది? క్రిస్ గేల్ మెరుపు బ్యాటింగ్.. ఏకంగా!

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş