iDreamPost

లారెన్స్ షాకింగ్ నిర్ణయం.. తన ట్రస్టుకు డబ్బు పంపొద్దంటూ..!

  • Author Soma Sekhar Published - 06:20 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Published - 06:20 PM, Wed - 30 August 23
లారెన్స్ షాకింగ్ నిర్ణయం.. తన ట్రస్టుకు డబ్బు పంపొద్దంటూ..!

సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటుగా ఎంతో మంది ఫౌండేషన్ లు పెట్టి అనాథ పిల్లలను, వృద్ధులను పోషిస్తున్నారు. అయితే ఈ ట్రస్ట్ లకు ప్రజల నుంచి ఎంతో కొంత డబ్బు వస్తుంటుంది. కొంత మంది మాత్రం తమ సొంత డబ్బుతోనే ట్రస్ట్ లను నడుపుతూ ఉంటారు కూడా. కాగా.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది హీరోలు ఫౌండేషన్స్ ద్వారా తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి హీరోల్లో రాఘవ లారెన్స్ ఒకరు. హీరోగా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తన ట్రస్ట్ ద్వారా అనాథ పిల్లలకు ఉచితంగా చదువులు కూడా చెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు లారెన్స్. ఇప్పటి నుంచి తన ట్రస్ట్ కు ఎవ్వరూ డబ్బు పంపొద్దు అంటూ ప్రకటించాడు. అందుకు గల కారణాలకు కూడా లారెన్స్ వెల్లడించాడు.

రాఘవ లారెన్స్.. హీరోగా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా ప్రేక్షకులకు సుపరిచితుడే. వీటితో పాటుగా అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని తన ట్రస్ట్ ద్వారా వారి బాగోగులు చూసుకుంటున్నాడు లారెన్స్. అయితే ఈ ట్రస్ట్ కు ఇప్పటి వరకు ఎంతో మంది సాయం చేశారు. కానీ ఇప్పటి నుంచి ఎవ్వరూ కూడా ట్రస్ట్ కు డబ్బులు పంపకండి అంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అందుకు గల కారణాలను కూడా లారెన్స్ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ట్వీట్ ద్వారా తన ట్రస్ట్ కు డబ్బులు పంపకండి అని చెప్పిన లారెన్స్.. తాజాగా వీడియో ద్వారా కూడా తన నిర్ణయాన్ని తెలియపరిచాడు. ఆ వీడియోలో లారెన్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

“నేను డ్యాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు 60 మంది పిల్లలకు చదువు చెప్పించడం, దివ్యాంగులకు డ్యాన్స్ నేర్పించడం చేశాను. అప్పుడు నేను ఒక్కడినే ట్రస్ట్ ను నడిపించేవాడిని. దీంతో నాకు కష్టం అనిపించి.. ఇతరుల సహాయం తీసుకున్నాను. గతంలో రెండు సంవత్సరాలకు ఒక మూవీ చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నాను. ఎంతో డబ్బు సంపాదిస్తున్నాను. అందుకే నా ట్రస్ట్ కు ఎవ్వరూ కూడా డబ్బు పంపించకండి అని చెబుతున్నా. నేను ఈ మాట పొగరుగా చెప్పడం లేదు” అంటూ రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.

ఇక నా ట్రస్ట్ కు పంపించే డబ్బులను మీరు మీ ఇంటి పక్కన, దగ్గర్లో ఉన్న ట్రస్ట్ లకు, పేద పిల్లలకు ఇవ్వండి అని లారెన్స్ తెలిపాడు. ఒకవేళ మీరు నాతోనే ఉంటామని, మీ ట్రస్ట్ కే డబ్బులు పంపిస్తామని అంటే.. నేనే స్వయంగా ఎవరికి డబ్బులు పంపాలో.. చెప్తాను. వారికి మీరే స్వయంగా మీ చేతులతో సహాయం చేయండి అంటూ లారెన్స్ ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. మరి రాఘవ లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి